BJP: అమిత్ షాతో రాష్ట్ర నేతల అత్యవసర భేటీ..! అందుకేనా..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు ఎలా అధికారంలోకి రావాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. అ దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అయితే 'ప్రజాగోస-బీజేపీ భరోసా'స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్స్‌ చివరి రోజున మంగళవారం 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు.

మనీష్‌ సిసోడియా

మనీష్‌ సిసోడియా

కానీ ముఖ్యనేతలను ఢిల్లీకి మంగళవారమే అత్యవసరంగా పిలిపించడంపై చర్చనీయంశంగా మారింది. మంగళవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జరిగే రాష్ట్ర మినీ కోర్‌కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్ట్‌ చేసిన రెండోరోజే ఈ సమావేశం ఉండటంపై రాజకీయ వర్గాల్లో పలు అంచనాలు మొదలయ్యాయి.

బీజేపీలో మార్పులు

బీజేపీలో మార్పులు

లిక్కర్ కుంభకోణం తెలంగాణలో కూడా అలజడి సృష్టించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులో రాష్ట్రానికి చెందిన వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. ఇదే కాకుండా రాష్ట్ర బీజేపీలో మార్పులు ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ అత్యవసర భేటీ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అమిత్ షాతో భేటీలో భేటీకి సునీల్‌ బన్సల్, తరుణ్‌చుగ్, బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీజాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయకార్యవర్గసభ్యులు మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి పాల్గొననున్నారు.

సునీల్‌ బన్సల్‌

సునీల్‌ బన్సల్‌

ఈ సంవత్సరం తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థతిపై సునీల్‌ బన్సల్‌ అమిత్ షాకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రణాళికలు రాచిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+