ఒక పార్టీది కొంగజపం.!మరో పార్టీది దొంగజపం.!కాంగ్రెస్,బిజెపి పార్టీలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.!

సూర్యాసేట/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బిజెపి దొంగ జపం చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి బీజేపి, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. అటు కాంగ్రెస్, ఇటు బిజేపి లు చేసే రెండు జపాలు కుడా ప్రజల కోసం కాదని అధికారమే పరమావదిగా పెట్టుకుని జపాలకు పూను కున్నాయని ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాల పై బిజెపి, కాంగ్రెస్ ల ధోరణిని తీవ్రంగా వ్యతిరేకించారు.

అంతే కాకుండా అధికారం కోసం జరుగుతున్న పరుగు పందెంలో బి ఆర్ ఎస్ పార్టీ తో పోటీ పడేందుకే దశాబ్ది ఉత్సావాలను రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో రాజీనామాలు అంటేనే తోక ముడిచిన ఆ రెండు పార్టీలకు దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదని మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

Jagadish Reddy

అధికారం లోకి వచ్చిందే తడవుగా 500 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో సహా ఏడు మండలలాలను ఆంధ్రలో కలిపిన బిజెపి పార్టీకీ తెలంగాణా గురించి మాట్లాడే హక్కు ఏక్కడదంటూ జగదీశ్ రెడ్డి నిలదీశారు. ఏడు దశాబ్దాలుగా తెలంగాణను గాడాంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ, దశాబ్ది ఉత్సావాల గురుంచి మాట్లాడడం విడ్డురంగా ఉందని ఎద్దేవాచేశారు. తెలంగాణ గురించి రాజీనామా అంటేనే తోక ముడిచిన కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉత్సావాల గురించి మాట్లాడడం హాస్య స్పదంగా ఉందన్నారు.

Jagadish Reddy

తొమ్మిదేళ్లలో ఊహకు మించిన అభివృద్ధిని సాదించుకున్నందునే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అంతటి అభివృద్ధిలో భాగస్వామ్యం ఐన బిఆర్ఎస్ శ్రేణులు దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చెయ్యాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలనలోనే రాష్ట్రంలో వెలుగు జిలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. వరి దిగుబడిలో సాధించిన విజయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సాధించిన విజయాలను తార్కాణమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+