ఒత్తిడి లేదన్న స్టీఫెన్ సన్, చిందేసిన అమ్మాయిలు (పిక్చర్స్)
హైదరాబాద్: తాను రూ.5 కోట్లకు ఆశపడేవాడిని కాదని, తాను ఎవరి ఒత్తిడి మేరకు పని చేయలేదని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ అన్నాడు.
తాను మధ్యతరగతి నుంచి వచ్చానని, డబ్బు విలువ తనకు తెలుసునని చెప్పాడు. తనకు రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పాడు.
ఓటుకు నోటు వ్యవహారంలో నిజాయితీగా వ్యవహరించాలంటూ మంగళవారం ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు.

స్టీఫెన్ సన్
నేనేం చేశానో, ఎందుకు చేశానో నాకు తెలుసునని చెప్పాడు. ఎవరి ఒత్తిడి కారణంగానో నేను ఈ పని చేయలేదన్నాడు.

స్టీఫెన్ సన్
తాను ఆంగ్లో ఇండియన్లకు మాత్రమే కాదని, క్రైస్తవులకు కూడా ఎమ్మెల్యేను అని చెప్పాడు. తన దృష్టిలో నాయకుడు అనేవాడు త్యాగశీలి అయి ఉండాలన్నాడు.

స్టీఫెన్ సన్
తాను ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పాడు. తన వ్యాపారం ఏడాదికి రూ.కోటి వరకు టర్నోవర్ ఉంటుందని, ఒక్కసారిగా ఐదు కోట్లు ఎప్పుడూ చూడలేదన్నాడు.

స్టీఫెన్ సన్
తెలంగాణకు అన్యాయం చేయాలని ఎవరు చూసినా, వారిని అడ్డుకునేందుకు వేలమంది స్టీఫెన్ సన్‌లు పుట్టుకు వస్తారని చెప్పాడు.

స్టీఫెన్ సన్
నేను ఎవరి ప్రలోభాలకు లొంగనని చెప్పాడు. తనను ఎవరూ ప్రభవితం చేయలేరని స్టీఫెన్ సన్ చెప్పాడు. తనకు రక్షణ ఇవ్వడం పైన మాట్లాడుతూ.. దేవుడే తనకు రక్షణ అని చెప్పాడు.

స్టీఫెన్ సన్
కాగా, స్టీఫెన్ సన్ పైన ఒత్తిడి చేసి కుట్రతో రేవంత్ రెడ్డిని ఇరికించారనే వాదనలు వచ్చిన విషయం తెలిసిందే. స్టీఫెన్ నివాసంలో నాలుగైదు కెమెరాలు, అదీ ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేయడం వెనుక కుట్ర కాకుంటే ఇంకా ఏమిటని ప్రశ్నించారు.

స్టీఫెన్ సన్
ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు బుధవారం తీసుకునే అవకాశాలున్నాయి. మెజిస్ట్రేట్ సమక్షంలో ఆయన వాంగ్మూలం తీసుకోనున్నారు. సెబాస్టియన్ కూతురు జెస్సికా, మాల్కం టేలర్ వాంగ్మూలాన్ని కూడా సేకరించనున్నారు.












Click it and Unblock the Notifications