జిమ్‌లలో స్టెరాయిడ్ ఇంజక్షన్లు: పోలీసుల తనిఖీలలో బయటపడ్డ షాకింగ్ దందా!!
యువతను టార్గెట్ చేసుకొని స్టెరాయిడ్ ఇంజక్షన్లను వారికి అలవాటు చేసే పనిలో పడింది ఓ ముఠా. ఈ ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు .
మీరు మంచి శరీరాకృతి కోసం జిమ్ లకు వెళుతున్నారా? అయితే అక్కడ ఇచ్చే ఇంజక్షన్లు, మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. స్టెరాయిడ్ ఇంజక్షన్ లను అలవాటు చేసి యువత ఆరోగ్యాన్ని పాడు చేసే ప్రయత్నం జరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో అనేక జిమ్ ల కేంద్రంగా జరుగుతున్న ఈ దందా ఇటీవల పోలీసులు వెలుగులోకి తెచ్చారు.

యువకులే టార్గెట్ గా స్టెరాయిడ్ ఇంజక్షన్లను అలవాటు చేస్తున్న జిమ్ సెంటర్లు
చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలామంది జిమ్ లకు వెళుతూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం జిమ్ కు వెళ్లి ఎక్సర్సైజులు చేసి శరీరాకృతిని అందంగా మలుచుకోవడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. వ్యాయామం ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా శరీర ఆకృతి కోసం కూడా చేస్తున్నవారు లేకపోలేదు. ఇక అటువంటి యువకులనే టార్గెట్ చేసుకొని స్టెరాయిడ్ ఇంజక్షన్లను వారికి అలవాటు చేసే పనిలో పడింది ఓ ముఠా.

పోలీసుల తనిఖీల్లో బయటపడ్డ స్టెరాయిడ్ ఇంజక్షన్లు
వ్యాయామం మాత్రమే కాకుండా, ఈ ఇంజక్షన్లు తీసుకోవడం ద్వారా తక్కువ సమయంలో శరీర ఆకృతిని వారికి కావలసిన విధంగా తయారు చేసుకోవచ్చని చెబుతూ యువతను ట్రాప్ లో పడేస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని పలు జిమ్స్ లో పోలీసులు తనిఖీ చేయగా స్టెరాయిడ్ ఇంజక్షన్ల బాగోతం బయటకు వచ్చింది. జిమ్ చేస్తున్న యువకులను లక్ష్యంగా చేసుకొని సిక్స్ ప్యాక్ బాడీ రావడం కోసం జిమ్ లలోనే స్టెరాయిడ్ ఇంజక్షన్లను ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

జిమ్ లో 180 ఇంజక్షన్లను 1100 స్టెరాయిడ్ మాత్రల స్వాధీనం
ఓల్డ్ సిటీ ప్రాంతంలోని ఓ జిమ్ పై దాడి చేసిన పోలీసులు అక్కడ స్టెరాయిడ్ ఇంజక్షన్లను సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 180 ఇంజక్షన్లను 1100 స్టెరాయిడ్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. స్టెరాయిడ్ ఇంజక్షన్స్, టాబ్లెట్ల దందాను నడుపుతున్న ఓం ప్రకాష్, సరోదే నరేష్, సయ్యద్ ఫరూఖ్ లను ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.

స్టెరాయిడ్ ఇంజక్షన్ల దందాపై కొనసాగుతున్న విచారణ
అయితే వీరు ఇప్పటివరకు ఎంతమందికి ఈ స్టెరాయిడ్ ఇంజక్షన్లను అమ్మారు? ఎంతమంది వాటికి అలవాటు పడ్డారు? ఎంత కాలం నుండి ఈ దందా చేస్తున్నారు? వీరు కాక ఈ దందా చేస్తున్న వారు మరెవరైనా ఉన్నారా? వంటి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే స్టెరాయిడ్ ఇంజక్షన్ల ప్రభావం శరీరం పైన ఏవిధంగా ఉంటుంది? ఎటువంటి పరిస్థితుల్లో ఇంజక్షన్స్ తీసుకుంటారు? వీటిని తీసుకుంటే శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వంటి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications