Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై దుష్ప్రచారం ఆపండి .. లేకుంటే కాంగ్రెస్ నేతలను ప్రజలే తరిమికొడతారన్న మంత్రి

తెలంగాణా పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెలి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏమి చేతగాక అధికార పార్టీపై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన ఏ ప్రాజెక్టూ ఇప్పటివరకూ పూర్తికాలేదని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు గుప్పించారు .హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ హయాంలో ఏ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని ప్రశంసించారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ ఇదని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకోటానికి కాంగ్రెస్ నాయకులు విఫలయత్నం చేశారని ఆయన ఆరోపించారు.

Recommended Video

    కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానించారా ? - లక్ష్మణ్
     Stop false campaign against Kaleshwaram .. otherwise the people teach a lesson to Congress leaders , says Errabelli

    ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లారనీ, కాలువల తవ్వకంపై స్టేలు తీసుకొచ్చి పనులను ఆలస్యం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం భూసేకరణపై కోర్టుల్లో స్టేలు తెచ్చి కాలువల పనిని ఆలస్యం చేసింది కాంగ్రెస్ వాళ్లు కాదా..అని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు . భూ నిర్వాసితులతో ఆందోళనలు చేయించి ప్రాజెక్ట్ నిర్మాణం అడ్డుకునే యత్నం చెయ్యలేదా అని ప్రశ్నించారు. అలాగే శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమని కూడా మండిపడ్డారు .కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేయవద్దని ఎర్రబెల్లి హితవు పలికారు. ఇలాగే అబద్ధాలు చెబితే కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో కూడా రానీకుండా ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+