ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
తెలంగాణలోని ఇంటర్ కళాశాలలకు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు ముగిసిన క్రమంలో ఇంటర్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మార్చి 30 వ తేదీని చివరి వర్కింగ్ డేగా ప్రకటించింది. దీంతో మార్చి 31వ తేదీ నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలకు మార్చి 31వ తేదీ నుంచి మే31వ తేదీ వరకు సెలవులు ఉండనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. జూన్ 1 వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు తెరుచుకోనున్నాయి.
గత నెల 28 నుంచి ఈనెల 18 వరకు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం మొత్తం 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,78,527 మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాగా, 4 లక్షలకుపైగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈ సారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించారు.

ఇంటర్ పరీక్షలు పూర్తయిన సందర్భంగా ఇంటర్ కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించేసింది. దీంతో రాష్ట్రంలోని అన్నిఇంటర్ కళాశాలకు మార్చి 31నుంచి మే 31వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. తిరిగి జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నీ దీనిని తూచ తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. ఎవరైనా కళాశాలలను నిర్వహిస్తే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇంటర్ బోర్డు ప్రకటన అనంతరం ఇంటర్ కళాశాలలల్లో అడ్మిషన్లు తీసుకోవాలని కూడా ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications