కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి.... గులాబీ గూటికి చేరనున్న సునీతా లక్ష్మా రెడ్డి
కొనసాగుతున్న వలసలు పర్వంతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. వరుస వలసలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హస్తానికి హ్యాండ్ ఇచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుంది.

టీఆర్ఎస్ బాట పట్టిన సునీతా లక్ష్మారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం ప్రగతి భవన్‌లో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో సమావేశమయ్యారు. నర్సాపూర్‌లో జరగనున్న సభలో సునీతా టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.

బీజేపీ లో చేర్చేందుకు విఫలయత్నాలు చేసిన డీకే అరుణ
అయితే సునీతా లక్ష్మారెడ్డి ని బిజెపిలో చేర్చుకోవాలని డీకే అరుణ విఫల యత్నాలు చేస్తుంది. పలుమార్లు బండారు దత్తాత్రేయ తో కలిసి సునీత లక్ష్మారెడ్డి ని పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేసింది. ఒక దశలో ఆమె బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం సైతం జరిగింది. పార్టీలో చేరితే చేవెళ్ల నియోజకవర్గం నుండి టిక్కెట్ ఇస్తామని తెలిపినప్పటికీ బిజెపిలో చేరడానికి సునీత లక్ష్మారెడ్డి ఆసక్తి చూపలేదు.

కేసీఆర్ ను కలిసిన సునీత ... గులాబీ గూటికి చేరనున్న కాంగ్రెస్ మహిళా నేత
ఇక అనూహ్యంగా గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకుని సీఎం కేసీఆర్ ని కలిసిన సునీత లక్ష్మారెడ్డి పార్టీలో చేరే విషయంపై గులాబీ బాస్ తో చర్చించింది. నర్సాపూర్లో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications