పెను ప్రమాదం నుంచి బయటపడ్డ సన్‌రైజర్స్ ఆటగాళ్లు..హుటాహుటిన తరలింపు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న పార్క్ హయత్ హోటల్‌లో ఈరోజు (ఏప్రిల్ 14, 2025) మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఈ హోటల్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఆటగాళ్లు ఉంటున్నారు. మంటలు హోటల్ మొదటి అంతస్తులో చెలరేగినట్లు సమాచారం. దట్టమైన పొగలు వ్యాపించడంతో కొంత భయాందోళన నెలకొంది. హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది త్వరగా చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లందరూ సురక్షితంగా ఉన్నారు. వారిని హోటల్ నుండి సురక్షితంగా తరలించారు. ప్రాథమికంగా విద్యుత్ వైర్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు, అయితే పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో హోటల్‌లో ఉన్న అతిథులు, సిబ్బంది కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే, అందరూ సురక్షితంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. సన్‌రైజర్స్ జట్టు త్వరలో జరగబోయే మ్యాచ్‌ల కోసం హైదరాబాద్‌లో ఉంది. ఈ ఘటన వారి బసపై స్వల్ప ప్రభావం చూపవచ్చు.

sunrisers players escape major danger in park hyatt hotel

ఇక సన్‌రైజర్స్ జట్టు విషయానికి వస్తే, ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. సన్‌రైజర్స్ చివరిగా ఆడిన మ్యాచ్‌లో అదరగొట్టింది. వరుస ఓటములతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులను నిరాశ పరించింది. ఆడిన ఐదు మ్యాచ్‌లో ఒక్కదానిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో సన్‌రైజర్స్ ఓపెనర్లు అదరగొట్టారు.పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత పోరాట పటిమను చూపించింది. కళ్ల ముందు కొండంత లక్ష్యం కనిపిస్తున్నప్పటికీ, ఏమాత్రం బెదరకుండా సులువుగా లక్ష్యాన్ని ఛేదించి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సత్తా ఎలాంటిదో మరోసారి ఐపీఎల్‌కు రుచి చూపించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు అదరగొట్టారు. ముఖ్యంగా తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు అభిషేక్ శర్మ. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.క్రీజ్‌లోకి వచ్చిన దగ్గర నుంచే పంజాబ్ బౌలర్ల విరుచుకుపడ్డాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీ అనంతరం సన్‌రైజర్స్ అభిషేక్ శర్మ చేసుకున్న సెలబ్రేషన్స్ ఆకట్టుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+