తెలంగాణ సర్కార్ కు సుప్రీం షాక్.. హరీష్ రావుకు భారీ ఊరట
సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఫోన్ ట్యాంపింగ్ కేసులో దూకుడుగా వెళ్తున్న రేవంత్ సర్కారు స్పీడ్ కు సుప్రీం ఇచ్చిన షాక్ తో బిగ్ బ్రేక్ పడినట్లైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో ఉన్న ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మరో వైపు చర్యలు తీసుకోవడానికి కోరిన అనుమతిని సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం హరీష్ రావుతో పాటు, మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావులకు ఊరటనిస్తూ.. వాటిని కొట్టివేసింది.సుప్రీంకోర్టు, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నందున, వాటిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసులో చర్యలు చేపట్టడానికి అనుమతి కోరగా, అత్యున్నత న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యం
బీఆర్‌ఎస్ హయాలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, కొందరు సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే కేసు నమోదు చేసి దూకుడుగా ముందుకు వెళ్తుంది. దర్యాప్తులో భాగంగా కీలక వ్యక్తులను కూడా విచారించింది. ఈ కేసులో ముఖ్య నిందితులుగా స్పెషల్ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఉన్నారు.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని హరీష్ రావు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపణలు చేసింది. దర్యాప్తును వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టు హైకోర్టు మధ్యంతర ఆదేశాలను గౌరవిస్తూ, ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. హైకోర్టు స్టే కారణంగా, హరీష్ రావు, రాధాకిషన్ రావు ప్రస్తుతానికి కేసులో ఊరట పొందారు. గతంలోనూ ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేసిన విషయం ధర్మాసనం గుర్తు చేసింది.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్ తో పాటు పలువురు కీలక నేతలున్నారని త్వరలోనే నిజాలు బయట పెడతామని కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications