కేసీఆర్‌పై కోపం..: టీడీపీ నేతల్ని ఎత్తుకెళ్లారు(పిక్చర్స్)
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంగళవారం గన్‌పార్క్ ధర్నా చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వీరు బుధవారం నాడు ఉదయం గవర్నర్ నరసింహన్‌కు తమ సస్పెన్షన్ పైన ఫిర్యాదు చేయనున్నారు.
తెదేపా శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు, ఉపనేత రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సాయన్న, ప్రకాష్ గౌడ్, వివేకానంద, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్‌లు ధర్నాకు దిగారు. అసెంబ్లీ మందునుంచి నోటికి నల్లగుడ్డలు కట్టుకుని గన్‌పార్క్‌కు ర్యాలీగా చేరుకున్నారు.
అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే మంత్రివర్గంలో మాల, మాదిగ, మహిళలకు ప్రాధాన్యం కల్పించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేశారు.
బుధవారం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే అన్నారు. జాతీయ గీతం విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిరూపిస్తే క్షణాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

టీడీపీ ధర్నా
అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంగళవారం నాడు గన్‌పార్క్ ధర్నా చేశారు.

టీడీపీ ధర్నా
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వీరు బుధవారం నాడు ఉదయం గవర్నర్ నరసింహన్‌కు తమ సస్పెన్షన్ పైన ఫిర్యాదు చేయనున్నారు.

టీడీపీ ధర్నా
తెదేపా శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు, ఉపనేత రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సాయన్న, ప్రకాష్ గౌడ్, వివేకానంద, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్‌లు ధర్నాకు దిగారు. అసెంబ్లీ మందునుంచి నోటికి నల్లగుడ్డలు కట్టుకుని గన్‌పార్క్‌కు ర్యాలీగా చేరుకున్నారు.

టీడీపీ ధర్నా
అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే మంత్రివర్గంలో మాల, మాదిగ, మహిళలకు ప్రాధాన్యం కల్పించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేశారు.

టీడీపీ ధర్నా
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున రెండు కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని ఎమ్మెల్యేలకు సర్దిచెప్పారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ ధర్నా
అనంతరం వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా టి టిడిఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నియంతలాగా వ్యవహరించి అప్రజాస్వామ్యంగా తమను సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు.

టీడీపీ ధర్నా
సస్పెన్షన్‌పై పునరాలోచించి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యేలంతా కలిసి పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు.

Click it and Unblock the Notifications