• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం కేసీఆర్ బక్కోడే అయినా మహా గట్టోడే: ఓ రేంజ్ లో పొగిడిన స్వామీజీ

|
  Telangana CM KCR Is A Super Hero : Chinna Jeeyar Swamy || Oneindia Telugu

  టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ కు స్వామీజీలు అంటే ఎనలేని భక్తి. సీఎం కేసీఆర్ భక్తి గురించి, ఆయన స్వామీజీలను ఎంతగా నమ్ముతారు అనే విషయాల గురించి ఎవరెన్ని విమర్శలు చేసినా అసలు పట్టించుకోరు. అంతేకాదు ఆయన చేయాలనుకున్న ప్రతీది చేస్తారు. యజ్ఞాలు,యాగాలు,హోమాలు అంటూ సీఎం కేసీఆర్ తన భక్తిభావాన్ని ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు.అలాంటి సీఎం కేసీఆర్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు చినజీయర్ స్వామీజీ .

  ఆయనకు ఏడు రోజులపాటు నేనే డ్రైవర్‌ను: తిరునక్షత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  చిన్నజీయర్ స్వామి పుట్టిన రోజు వేడుకలకు వెళ్ళిన సీఎం కేసీఆర్

  చిన్నజీయర్ స్వామి పుట్టిన రోజు వేడుకలకు వెళ్ళిన సీఎం కేసీఆర్

  సీఎం కేసీఆర్ కు చిన్న జీయర్ స్వామి అంటే చాలా ప్రత్యేకమైన భక్తి భావం ఉంటుంది. చిన్న జీయర్ స్వామి కేసీఆర్ కు ఉన్న అనుబంధం ఇంతా అంతా కాదు. అలాంటి చిన్న జీయర్ స్వామి తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కుటుంబంతో కలిసి తనను కలవడానికి వచ్చిన సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా స్వామీజీలు ఎవరిపైనా పొగడ్తల వర్షం కురిపించరు. తమ వద్దకు వచ్చిన వారందరినీ ఆశీర్వదిస్తారే తప్ప ప్రత్యేకంగా ఎవరిపైనా వ్యాఖ్యలు చెయ్యరు.

  కెసిఆర్ బక్కోడే అయినా మహా గట్టోడు అంటూ స్వామీజీ కితాబు

  కెసిఆర్ బక్కోడే అయినా మహా గట్టోడు అంటూ స్వామీజీ కితాబు

  సీఎం కేసీఆర్ విషయంలో మాత్రం స్వామీజీలు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తారు. కెసిఆర్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తారు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన సీఎం కేసీఆర్ ను చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలతో పొగిడారు. కెసిఆర్ బక్కోడే అయినా మహా గట్టోడు అంటూ కితాబిచ్చారు. సీఎం హోదాలో కెసిఆర్ ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేశారని, తమలో ఉన్న భక్తి భావాన్ని చాటుకోవడానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు భయపడతారని,కానీ కేసీఆర్ అందుకు భిన్నంగా తన భక్తిభావాన్ని ఎప్పటికీ చాటుకుంటూనే ఉంటారని చిన్న జీయర్ స్వామి కెసిఆర్ ను అభినందించారు.

  యాదాద్రికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారన్న స్వామీజీ

  యాదాద్రికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారన్న స్వామీజీ

  సాధారణంగా రాజకీయాల్లో ఉండేవారు దేవుడి గురించి మాట్లాడడానికి భయపడతారని, ఎక్కడ ఏం మాట్లాడితే ఏ కమ్యూనిటీతో ఇబ్బంది వస్తుందో అని ఆలోచిస్తారని, కానీ కెసిఆర్ దానికి వ్యతిరేకంగా భగవద్భక్తిని ప్రదర్శిస్తారని చిన్న జీయర్ స్వామి కెసిఆర్ లో ఉన్న విలక్షణమైన లక్షణాలను పేర్కొన్నారు. ఇక యాదాద్రి దేవస్థానం విషయంలో కెసిఆర్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా యాదాద్రికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు వచ్చిందని, కాంతులీనే అద్భుత క్షేత్రంగా యాదాద్రి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ తయారు చేయిస్తున్నారని స్వామిజీ ప్రశంసించారు.

  ఎవరినీ లెక్క చెయ్యకుండా భక్తి చాటుకునే ధైర్యవంతుడు అని ప్రశంస

  ఎవరినీ లెక్క చెయ్యకుండా భక్తి చాటుకునే ధైర్యవంతుడు అని ప్రశంస

  ఎవరెన్ని విమర్శలు చేసినా లక్ష్యపెట్టకుండా ముందుకు సాగే లక్ష్య సాధకుడు అని పేర్కొన్న చిన్న జీయర్ స్వామీజీ సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయ నిర్మాణాన్ని ఒక మిషన్ లా తీసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నో యజ్ఞాలు ,యాగాలు చేస్తూ తనలోని ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని చాటుకున్నారని పేర్కొన్న చినజీయర్ స్వామి కెసిఆర్ బక్కవాడైనా గొప్పవాడని, మనసులో ఉన్న భక్తిని దాచుకోకుండా చాటి చెబుతున్న ధైర్యవంతుడు అని తెగ పొగిడేశారు.

   స్వామీజీ వ్యాఖ్యలకు సంతోషపడ్డ సీఎం కేసీఆర్

  స్వామీజీ వ్యాఖ్యలకు సంతోషపడ్డ సీఎం కేసీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు పలు సందర్భాల్లో కెసిఆర్ స్వయంగా తనకు తానే తన పర్సనాలిటీపై వ్యాఖ్యలు చేసుకున్నారు. బక్కోడిని అని ఏం చేయగలనని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నారని, బక్కోడినే అయినా గట్టోడినే అని పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కెసిఆర్ పై చినజీయర్ స్వామి చేసిన బక్కోడే అయిన గట్టోడే వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ కు తెగ సంతోషాన్ని కలిగించాయట. ఎప్పుడు ఎవరిని పొగడని స్వామీజీలు,సీఎం కేసీఆర్ ని ప్రత్యేకంగా పొగిడితే సంతోషమే కదా మరి.

  English summary
  On the occasion ofchinna jiyar swamiji's birthday, swamiji praised CM KCR with interesting comments. KCR is lean even though he is so strong. KCR has done many wonderful things as a CM, many chief ministers are afraid to express their devotion, but the KCR will continue to show his devotion and chinna jiyar Swami congratulated KCR.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X