ప్రియుడితో రాసలీలలు: భర్తకు ట్విస్టిచ్చిన స్వాతి, మత్తిచ్చి, ఎవడు సినిమాలో...

Recommended Video

    Nagar Kurnool Swathi Mystery Case Twist | Oneindia Telugu

    నాగర్‌కర్నూల్: ప్రేమించిన పెళ్ళి చేసుకొన్న భర్తను ప్రియుడితో రాసలీలలు సాగించేందుకు హత్య చేసింది.టీవి సీరియళ్ళు, హర్రర్ సినిమాలను తలపించే రీతిలో భర్తను హత్య చేసింది స్వాతి.

    భర్త రూపు రేఖలను పోలి ఉన్న ప్రియుడు రాజేష్‌తో జీవితాన్ని కొనసాగించాలని భావించింది. కుటుంబసభ్యులకు వచ్చిన అనుమానాలు, టెక్నాలజీ సహయంతో పోలీసులు ఈ కేసును చేధించారు. అచ్చు ఎవడు సినిమా తరహలో తతంగాన్ని నడిపారు ప్రేమికులు. కానీ, పోలీసులకు చిక్కారు.

    నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సుధాకర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌పై నవంబర్ 27వ, తేదిన యాసిడ్ దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే యాసిడ్ దాడి ఘటనపై పోలీసులు లోతుగా విస్తరిస్తే అసలు విషయం బట్టబయలైంది.

    ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన స్వాతి, భర్త స్థానంలో ప్రియుడిని ఉంచి కుటుంబసభ్యులతో అందరిని నమ్మించింది.అయితే ఎట్టకేలకు నిందితులను సాక్ష్యాధారాలతో రుజువు చేశారు.

    వివాహేతర సంబంధంతో హత్య

    వివాహేతర సంబంధంతో హత్య

    సుధాకర్‌రెడ్డికి, స్వాతికి కొంత కాలం క్రితం వివాహమైంది. అయితే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్ళి చేసుకొన్నారు. అయితే సుధాకర్ రెడ్డి తొలుత ప్రైవేట్ ఉద్యోగం చేసి నాగర్‌కర్నూల్ పట్టణంలో క్రషర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్‌గా అవతారమెత్తాడు.అయితే కాంట్రాక్ట్ పనుల నిమిత్తం సుధాకర్‌రెడ్డి నిత్యం బయట తిరిగేవాడు. అయితే అదే సమయంలో నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఫిజియోథెరపీలో పనిచేసే రాజేష్‌తో స్వాతికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ మధ్య వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకొనేందుకు స్వాతి, రాజేష్‌లు కలిసి సుధాకర్‌రెడ్డిని హత్య చేశారు.

    స్వాతి, సుధాకర్‌రెడ్డి మధ్య ఘర్షణ

    స్వాతి, సుధాకర్‌రెడ్డి మధ్య ఘర్షణ


    స్వాతి, రాజేష్ మధ్య వివాహేతర విషయమై సుధాకర్‌రెడ్డికి అనుమానం వచ్చింది. ఈ విషయమై భార్య స్వాతిని సుధాకర్‌రెడ్డి నిలదీశాడు.నవంబర్ 26వ, తేదిన స్వాతిని నిలదీయడమే కాకుండా ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇరువురూ తోసుకోవడంతో సుధాకర్‌రెడ్డి తలకు గాయమైంది. అదేరోజు రాత్రి 12గంటల ప్రాంతంలో సుధాకర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లి తలకు కుట్లు వేయించుకుని ఇంటికివచ్చాడు.సుధాకర్‌రెడ్డిని చంపాలని స్వాతి ప్లాన్ చేసింది.

    మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపారు

    మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపారు

    నవంబర్ 26వ, తేది రాత్రే సుధాకర్‌రెడ్డిని చంపాలని ప్లాన్ చేశారు. కానీ, సుధాకర్‌రెడ్డితో పాటు మరో వ్యక్తి కూడ ఉండడంతో వీలు కాలేదు. దీంతో ప్లాన్‌ను మార్చారు.సుధాకర్‌రెడ్డి ఇంటి నుండి మరో వ్యక్తి వెళ్ళిపోగానే స్వాతి తన ప్రియుడు రాజేష్‌ను పిలిపించింది. సుధాకర్‌రెడ్డి నోట్లో గుడ్డలు కుక్కి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు.ఇనుపరాడ్‌తో సుధాకర్‌రెడ్డి తలపై కొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.

    నవాబ్‌పేట అడవిలో సుధాకర్‌రెడ్డి శవం దగ్దం

    నవాబ్‌పేట అడవిలో సుధాకర్‌రెడ్డి శవం దగ్దం


    దుప్పట్లో సుధాకర్‌రెడ్డి శవాన్ని మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని ఇంట్లో నుంచి స్వాతి, రాజేష్‌ బయలుదేరారు. ఉదయం ఏడు గంటలకల్లా నవాబ్‌పేట వద్దనున్న అటవీ ప్రాంతానికి చేరుకుని రోడ్డుకు వంద మీటర్ల దూరంలో శవాన్ని విసిరేశారు. వెంట తీసుకెళ్లిన పెట్రోల్‌తో సుధాకర్‌రెడ్డి శవాన్ని తగులబెట్టి అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. అక్కడ అప్పటి వరకు వాడిన కారును మెకానిక్‌ షెడ్డులో సర్వీసింగ్‌ చేయాలంటూ ఇచ్చేశారు.సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యుల అనుమానం మేరకు పోలీసులు విచారణ చేస్తే అసలు విషయం వెలుగు చూసింది

    ఎవడు సినిమా తరహలో

    ఎవడు సినిమా తరహలో

    అచ్చు ఎవడు సినిమా తరహలో ప్రేమికుల జంట రాజేష్, స్వాతి ప్లాన్ చేశారు. సుధాకర్ రెడ్డి, రాజేష్ ముఖంలో కొంచెం సరిపోలుతాయి. అయితే ఈ తరుణంలో రాజేష్ ముఖానికి క్రీమ్ రాసుకొని యాసిడ్ దాడి జరిగిందని నమ్మించారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ కోసం హైద్రాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ పూర్తైతే అందరూ తమ ప్లాన్ నిర్విఘ్నంగా పూర్తైయ్యేదని భావించారు. అదే సమయంలో సుధాకర్ రెడ్డి కుటుంబసభ్యులకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌పై అనుమానం వచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటకు వచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+