ఆడుకుంటాడని ఉయ్యాల కట్టారు .. అది చిన్నారి ఊపిరి తీసింది
విధిని ఎవరూ మార్చలేరు అంటారు. సరదాగా ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా ఊహించని పరిణామంతో మృత్యువాత పడతాడని ఆ తల్లి దండ్రులు ఊహించలేదు. నిరుపేద కుటుంబాల్లో చిన్నారులు నిద్ర పోవాలని ఉయ్యాల కడతారు. ఆ ఉయ్యాలే ఉరితాడై చిన్నారి ప్రాణం తీస్తుందని ఆ తల్లిదండ్రులు కలనైనా భావించలేదు. ఇంట్లోనే ఆడుకునే బాబు హఠాత్తుగా విగత జీవిగా మారితే ఆ తల్లిదండ్రుల శోకానికి అవధులు లేవు. కంటికి కడివెడు దుఃఖిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్‌లో విషాదకర సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన జంపాల కుమార్, అనిత దంపతుల కుమారుడు పదేళ్ళ ఆనంద్ చంటి పిల్లల కోసం ఇంట్లో వేసిన ఉయ్యాలలో ఆడుకుంటున్నాడు , చీర చుట్టూ తిరిగి ఆనంద్ మెడకు బిగియడంతో ఊపిరాడక తల్లడిల్లాడు. పక్క గదిలో ఉన్న కుటుంబసభ్యులు అది గుర్తించే సరికి ఆలస్యం అయ్యింది. అయినప్పటికీ అది గమనించిన తల్లిదండ్రులు అతడిని బాదేపల్లి ఆసుపత్రికి చేర్చారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిలోఫర్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఇంట్లో చీరతో వేసిన ఉయ్యాలలో ఊగుతూ సరదాగా ఆడుకుంటున్నాడు అనుకున్న ఆనంద్ తల్లి దండ్రులను విషాదంలో ముంచి వెళ్ళిపోయాడు . ఉయ్యాలే ఉరితాడై మెడకు బిగుసుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిలింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications