రైతు రుణమాఫీ అమలు పై రేవంత్ గుడ్ న్యూస్ - విధి విధానాలు..!!
రైతు రుణమాఫీ అమలుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. రైతురుణమాఫీని ఆగస్టు 15లోగా చేసి తీరుతామని రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఈ భేటీ లో రైతు రుణమాఫీ అమలు పైన విధి విధానాలను అధికారికంగా ఆమోదించనున్నారు. అలాగే రాబోయే ఐదు సంవత్సరాలకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న దానిపై కూడా క్యాబినెట్‌లో చర్చించాలని నిర్ణయించారు.
ప్రభుత్వం కసరత్తు
రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు 15లోపు రుణాలు మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. రుణమాఫీకి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రూ 2లక్షల వరకు రైతు రుణ మాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేస్తామని రేవంత్ పలు ప్రాంతాల్లో ప్రమాణం చేసి చెప్పారు. దీనికి సంబంధించి ప్రాధమికంగా కసరత్తు పూర్తయింది.

మార్గదర్శకాలు సిద్దం
2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కాలాన్ని పంటల రుణమాఫీ కాలాన్ని ప్రభుత్వం నిర్ధేశించి.. రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లతోనూ చర్చలు జరిగాయి. ఆ దిశగానే రుణాలను మాఫీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమలు మార్గదర్శకాల పైన అధికారులు ఇప్పటికే సూత్రప్రాయంగా నివేదిక అందించారు. దీని పైన ఈ నెల 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. తంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపజేశారు.. ఈ అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది.
18న అధికారిక ఆమోదం
తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు నేరుగా జమ అయ్యేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖల నుంచి ఆ కార్పోరేషన్ కు తిరిగి ఆ మొత్తం చెల్లించేలా నిర్ణయం జరిగింది. కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని.. రెన్యువల్ చేసుకోలేదు. మరి వారికి మాఫీ వర్తిస్తుందా అన్నది చూడాలి. ఈ దిశగా బ్యాంకర్లతో వ్యవసాయ, ఆర్థికశాఖ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రుణమాఫీ అమల్లో ఎక్కువ మందికి లబ్ది జరిగేలా నిర్ణయం ఉండాలని రేవంత్ భావిస్తున్నారు. దీంతో..ప్రభుత్వం ప్రకటించే విధి విధానాల పైన ఆసక్తి కనిపిస్తోంది.
-
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications