హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిగ్గీపై పరువునష్టం దావా, క్రిమినల్ కేసు: మంత్రి తలసాని హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్‌పై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం నిప్పులు చెరిగారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన డిగ్గీపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్‌పై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం నిప్పులు చెరిగారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన డిగ్గీపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

భారీ భూస్కాంలో తలసాని: డిగ్గీ సంచలనం, కింది ఉద్యోగులే బలి: రేవంత్భారీ భూస్కాంలో తలసాని: డిగ్గీ సంచలనం, కింది ఉద్యోగులే బలి: రేవంత్

మియాపూర్ భూకుంభకోణంలో తన పేరును డిగ్గీ ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు.

Talasani ready to take action against Digvijay Singh

కాగా, అంతకుముందు దిగ్విజయ్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే మియాపూర్ భూకుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. భూకుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాత్ర ఉందని ఆరోపించారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు మల్లు రవి, రంగారెడ్డి, లక్ష్మణ్‌ గౌడ్‌లతో కలిసి దిగ్విజయ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో కొందరు సబ్‌రిజిస్ట్రార్లను బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదన్నారు.

కేసీఆర్‌ సర్కార్‌పై తమకు విశ్వాసం లేదని, భూకుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి తలసాని రాజీనామా చేయాలన్నారు.

English summary
Minister Talasani Srinivas Yadav is ready to take action against Digvijay Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X