చంద్రబాబుపై తలసాని తిట్ల పర్వం ... అయ్యలానే కొడుకు డ్రామాలు చేస్తున్నాడని ఫైర్

Recommended Video

    అయ్యలానే కొడుకు డ్రామాలు చేస్తున్నాడని తలసాని ఫైర్ || Oneindia Telugu

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆయన వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ తిట్ల దండకం చదువుతున్నాడు . మొన్నటికి మొన్న కేసీఆర్ పేరును నిద్రలో కూడా తలుచుకుంటున్నారని ఎద్దేవా చేసిన తలసాని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చిల్లరగా మారాడని మండిపడ్డారు .

    ఇక చంద్రబాబుతో పాటు లోకేష్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు తలసాని .అయ్య డ్రామా ఎలా చేస్తాడో.. కొడుకు డ్రామా కూడా మంగళగిరిలో డ్రామాలు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా మూడు, నాలుగు చోట్ల గొడవలైనట్టు టీవీలో చూశామన్న తలసాని కావాలని చంద్రబాబు దాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు .మొత్తం రాష్ట్రమంతా గందరగోళమైనట్టు చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారన్నారు తలసాని .

     Talasani sensation ..We have seen how lokesh played drama in Mangalgiri like his father

    ఇక ఏపీ స్పీకర్ పై జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ ఆయన ఒక బాధ్యత గల స్పీకర్ సత్తెనపల్లిలో పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లి తలుపు పెట్టుకుంటాడా? అని ప్రశ్నించారు.ఆయన అలా చెయ్యటం వల్లే గొడవ జరిగిందని పేర్కొన్నారు .అదంతా ఒక డ్రామా అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ . కేంద్ర ప్రభుత్వం.. ఈసీపై ఒత్తిడి తెచ్చి అధికారులను మార్చారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు తప్పుడు ఆరోపణలని ఆయన ఆన్నారు . ఒక రాష్ట్రంలో ఇద్దరో, ముగ్గురో ఎస్పీలను, ఐదారుగురు ఇన్‌స్పెక్టర్లు, ఇంటెలిజెన్స్ ఐజీని బదిలీ చేస్తే రాష్ట్ర యంత్రాంగం మొత్తం మార్చినట్టేనా అని ప్రశ్నించారు .అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థ అంటే బదిలీ అయిన వాళ్ళేనా .. చంద్రబాబు ఉద్దేశం అదేనా? అని తలసాని ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+