టిసిఎస్ టెక్కీ అనుశ్రీ అచూకీ గుర్తింపు: మతిస్థిమితం కోల్పోయింది
హైదరాబాద్: గచ్చిబౌలి నుంచి రెండు రోజుల క్రితం అదృశ్యమైన టిసిఎస్ సాఫ్టువేర్ ఇంజినీర్ అనుశ్రీ అచూకీని గుర్తించారు. ఆమె పటాన్‌చెరు సమీపంలోని ఓ చెరువు వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు, పోలీసులు గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
Picture of the day : అంతా ఎరుపే
ఆమెను చెరువు వద్ద గుర్తించిన స్థానిక పోలీసులు ఆమెతో మాట్లాడే ప్రయత్నాలు చేశారు. ఆయితే ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని భావిస్తున్నారు. ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకు వచ్చి.. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆమె చెరువు వద్దకు ఎందుకు వెళ్లిందో కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఎట్టకేలకు అనుశ్రీ ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు, సహోద్యోగులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
శివారు ప్రాంతాల్లో ఆమె సంచరిస్తున్నట్లు గుర్తించారు. చివరకు పటాన్ చెరు సమీపంలోని చెరువు వద్ద ఆమె ఉన్నట్లుగా గుర్తించారు. కాగా, కర్నాటకకు చెందిన అనుశ్రీ రెండు రోజుల క్రితం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆమె మతిస్థిమితం లేని స్థితిలో ఉన్న ఆమెను హాస్పిటల్లో చేర్చారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications