జూబ్లీహిల్స్ పై తేల్చేసిన చంద్రబాబు, బీజేపీ వాట్ నెక్స్ట్ - మారుతున్నలెక్కలు..!!

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ కీలకంగా మారుతోంది. ఇక్కడ గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. సిట్టింగ్ సీటు దక్కించుకునేందుకు బీఆర్ఎస్.. ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కాగా.. బీజేపీ అభ్యర్ధి పైన కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం ఆసక్తి కరంగా మారింది. అటు ఎంఐఎం పోటీకి దూరంగా ఉండటం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం. ఇప్పుడు చంద్రబాబు జూబ్లీహిల్స్ పైన తన నిర్ణయం స్పష్టం చేయటంతో.. బీజేపీ ఏం చేస్తుందనేది ఉత్కంఠ పెంచుతోంది.

జూబ్లీహిల్స్ బై పోల్ లో టీడీపీ తమ వైఖరి తేల్చి చెప్పింది. తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ బై పోల్ లో పోటీ చేసేందుకు అనుకూల నిర్ణయం తీసుకోవాలని నేతలు కోరారు. అయితే.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండటం తో టీడీపీ పోటీ చేస్తుందా.. బీజేపీ పోటీకి దిగితే మద్దతు ఇస్తుందా అనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గా కొనసాగింది. అయితే, పార్టీ నేతల సమావేశంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు.

TDP and AIMIM decided likely not to contest in Jubilee hills by poll who will get benefit

అదే సమయంలో ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతోంది. బీజేపీ మద్దతు కోరితే సానుకూలంగా స్పందించే అంశం పరిశీలన చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ పోటీకి సిద్దం కావటంతో టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, జాతీయ స్థాయిలోనే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఇప్పుడు తెలంగాణలో మాత్రం బీజేపీ కోరితేనే మద్దతు ఇవ్వాలనే వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో తమకు ఎవరితో పొత్తు ఉండదని కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రామచంద్రరావు స్పష్టం చేసారు. దీంతో, టీడీపీ సైతం బీజేపీతో జాతీయ స్థాయిలో.. ఏపీలో మిత్రపక్షంగా కొనసాగుతూనే తెలంగాణ లో మాత్రం పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తోంది. దీంతో.. ఇప్పుడు బీజేపీ ముందుకు వచ్చి టీడీపీ మద్దతు కోరితేనే... ఆ పార్టీ అధికారికంగా స్పందించే ఛాన్స్ ఉంది.

ఇక, అటు రేవంత్ తొలి నుంచి ఈ ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం ఈ నియోజకవర్గంలో పోటీ నిర్ణయం పైన కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో.. ఎంఐఎం ఇప్పుడు ఇక్కడ పోటీ నుంచి తప్పుకుంది. ఫలితంగా కాంగ్రెస్ కు మైనార్టీ ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అటు బీఆర్ఎస్ సైతం మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్ధిని ఖరారు చేయగా.. కాంగ్రెస్ బీసీ అభ్యర్ధిని ఈ రోజు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు టీడీపీ నిర్ణయం పైన స్పష్టత రావటంతో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+