జూబ్లీహిల్స్ పై టీడీపీ అనూహ్య నిర్ణయం, సీన్ ఛేంజ్- అక్కడే ట్విస్ట్..!?
తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ కీలకంగా మారుతోంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. సీఎం రేవంత్ ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో ఉన్నారు. సిట్టింగ్ సీటు నిలబెట్టుకొనేలా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్ధి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. కాగా, జూబ్లీహిల్స్ ఎన్నిక పైన టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నిర్ణయం కీలకంగా మారుతోంది. అయితే, ఇదే సమయంలో ఊహించని ట్విస్ట్ తెర మీదకు వచ్చింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఇప్పుడు హోరా హోరీగా మారుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ ముగ్గురు పేర్లను ఏఐసీసీకి పంపింది. అందులో నవీన్ యాదవ్ పేరు ఖాయమని ప్రచారం సాగుతోంది. బీసీనే బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంఐఎం పోటీ చేయటం పైన ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎంఐఎం తమకు మిత్రుడుగానే చెబుతున్నారు. ఇక.. బీజేపీ అభ్యర్ధి విషయంలో ఏర్పాటైన కమిటీ రేపు నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికలో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు.

ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇక్కడ పోటీ చేయదని.. బీజేపీకి మద్దతు ఇస్తుందని అందరూ అంచనా వేసారు. కాగా.. మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు..ఏపీ నుంచి వచ్చి స్థిర పడిన వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉండటంతో... టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దిగితే కలిసి వస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు.
దీంతో.. ఈ సాయంత్రం చంద్రబాబుతో టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. అటు బీజేపీ నేతలు తామే పోటీ చేస్తామని చెబుతున్నారు. బీజేపీ పోటీ చేస్తే వారికే మద్దతు ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేసే అవకాశం ఉంది. తెలంగాణ లో 2023 ఎన్నికల్లోనూ టీడీపీ దూరంగా ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం లేదని చెబుతున్నారు.
దీంతో.. తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్ధి గెలుపు కు సహకారం అందించాలని చంద్రబాబు సూచించే అవకాశం కనిపిస్తోందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్ధికి టీడీపీ, జనసేన సైతం ప్రచారం చేయటం ఖాయమని భావిస్తున్నారు. ఇక.. కాంగ్రెస్ నుంచి బీసీ... బీఆర్ఎస్ నుంచి సునీత ఖరారు కావటంతో బీజేపీ నుంచి ఏ వర్గానికి సీటు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. అయితే.. జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీ చేసే అంశం పైన చంద్రబాబు భేటీలోనే స్పష్టత వస్తుందనేది మరో వాదన. దీంతో.. జూబ్లీహిల్స్ లో త్రిముఖ పోరుగా మారుతోంది. టీడీపీ ప్రభావం స్పష్టంగా ఉంటుందని అంచనా. దీంతో.. ఈ ఉప ఎన్నిక విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి నెలకొంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications