హత్యలే: టిడిపి నేతల ధర్నా, ఫిర్యాదు(పిక్చర్స్)

హైదరాబాద్‌: రైతు ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మున్ముందు ఆత్మహత్యలు ఉండవనే భరోసా ఇచ్చేదాకా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు, టిడిపి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కె చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల కాలంలోనే 475 మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

టిడిపి నేతల ధర్నా

టిడిపి నేతల ధర్నా

రైతు ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు.

టిడిపి నేత ధర్నా

టిడిపి నేత ధర్నా

ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ధర్నాలో పొల్గొన్న రైతులు

ధర్నాలో పొల్గొన్న రైతులు

మున్ముందు ఆత్మహత్యలు ఉండవనే భరోసా ఇచ్చేదాకా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు.

టిడిపి నేతల ధర్నా

టిడిపి నేతల ధర్నా

మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

టిడిపి నేతల ధర్నా

టిడిపి నేతల ధర్నా

కె చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల కాలంలోనే 475 మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

టిడిపి నేతల ధర్నా

టిడిపి నేతల ధర్నా

మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు, టిడిపి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

హెచ్చార్సీకి ఫిర్యాదు

హెచ్చార్సీకి ఫిర్యాదు

ఇందిరాపార్కు వద్ద ధర్నా అనంతరం టీడీపీ నేతలు బాధిత రైతు కుటుంబాలతో మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వాన్ని బాధ్యులుగా గుర్తించి హత్యానేరం మోపాలని కోరారు.

హెచ్చార్సీకి ఫిర్యాదు

హెచ్చార్సీకి ఫిర్యాదు

బాధిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషన్‌ చైర్మన్‌ నిస్సార్‌ అహ్మద్‌ కక్రూకు వినతిపత్రం సమర్పించారు.

అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ సమస్యపై నిలదీస్తారనే భయంతోనే కేసీఆర్‌ సర్కార్‌ సభ నుంచి అప్రజాస్వామికంగా బహిష్కరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం ఇందిరాపార్క్‌ సమీపంలోని గ్రేటర్‌ టిడిపి కార్యాలయంలో మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన బాధిత 165 కుటుంబాలకు పార్టీ తరఫున రూ.50వేల చొప్పున చెక్కులు అందజేశారు.

టిటిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోనే రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని అన్నారు. కనీసం బాధిత కుటుంబాలను కెసిఆర్ పరామర్శించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. రైతు ఆత్మహత్యల నిరోధానికి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పెద్దలంతా స్పందించాలని కోరారు. టిటిడిఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... సర్కార్‌ నిర్లక్ష్యంతో అప్పుల పాలై అమరులైన రైతు కుటుంబాలను ఆదుకోని కేసీఆర్‌ ఓ సన్నాసి అని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+