వారికి ఇంటికో ఉద్యోగం, ఇల్లు, సైకిల్, ల్యాప్‌టాప్, రూ.3వేలు: టీడీపీ మేనిఫెస్టోలో ఇవీ!
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బుధవారం తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, సీనియర్ నేతలు దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉంటుందని ఎల్ రమణ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను సంప్రదించి మేనిఫెస్టోకు రూపకల్పన చేశామని చెప్పారు. త్వరలోనే కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకటిస్తామని తెలిపారు. తెరాస పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.

ఇంటికో ఉద్యోగం, ఇల్లు
మానవతావాదంతో టీడీపీ ఆవిర్భవించిందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేసే పార్టీ టీడీపీ అన్నారు. టీడీపీ అంటే సంక్షేమం అన్నారు. మొదట పింఛన్ ఇచ్చింది ఎన్టీఆరే అన్నారు. అధికారంలోకి వస్తే తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అమరావీరుల సంక్షేమానికి ప్రధాన్యం ఇస్తామని చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, ఇల్లు అన్నారు. ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల అన్నారు. ప్రతి జిల్లాలో పూలే, అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ అన్నారు. ప్రొపెసర్ జయశంకర్ పేరుతో విద్యాసంస్థలు ఉంటాయన్నారు.

టీడీపీ మేనిఫెస్టో
హైదరాబాదును చంద్రబాబు అంతర్జాతీయ చిత్రపటంలో పెట్టారని, తెలంగాణ ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించిందని, ఇప్పుడు ఆధునిక తెలంగాణ నిర్మాణం తమ లక్ష్యమని మేనిపెస్టోలో పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి ఇంటికొక ఉద్యోగం, ఒక ఇల్లు, రూ.10 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అమరవీరులు శాశ్వతంగా చరిత్రలో ఉండేందుకు అందుకు అనుగుణమైన కార్యక్రమాలు చేపడతామన్నారు. అమరవీరుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. అమరవీరులకు శాశ్వత స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ పితామహులకు గౌరవం, వారి పేరిట కార్యక్రమాలు ఉంటాయన్నారు.

నిరుద్యోగ భృతి, ల్యాప్‌టాప్‌లు
హైదరాబాద్‌లో ధర్నా చౌక్ పునరుద్ధరణ, విభజన బిల్లు అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి, సీఎం, మంత్రుల నివాసాలను శాశ్వత ప్రాతిపదికన నిర్మించడం, ప్రతియేటా ఉద్యోగ క్యాలెండర్, మొదటి ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ, రూ.3వేల నిరుద్యోగ భృతి, ఇంటర్ నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, ప్రజాసుపత్రిగా ప్రగతి భవన్ మార్పు, వికారాబాద్‌లో నేచర్ క్యూర్ చికిత్సాలయం, 8వ తరగతి నుంచి బాలికలకు సైకిళ్ళ పంపిణీ, ప్రార్థనా మందిరాల్లో పని చేసే వారికి నెల జీతం, హైదరాబాదులో ఐటీఐఆర్ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యలేని నగరంగా హైదరాబాద్.. ఇలా పలు హామీలు ఉన్నాయి.

ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా రూ.5కే భోజనం
వికలాంగులకు భృతి రూ.2వేలు ప్రతీ నెలా ఇవ్వనున్నట్టు టీడీపీ తన మేనిఫెస్టోలో తెలిపింది. బీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం ఏటా రూ.15వేలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రతి కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 7 కిలోల నాణ్యమైన బియ్యాన్ని కిలో రూపాయికి ఇస్తామని పేర్కొన్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం ఇస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications