బాబునే ఆంధ్రకి వెళ్లగొట్టారు!: టిడిపి నేత సంచలనం, కెటిఆర్! నాది హైద్రాబాద్, నీవే గుంటూర్లో: లోకేష్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాజ్రేందనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై బుధవారం రోడ్డు షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునే ఆంధ్రకు పంపిన ఘనత మా తెలంగాణ ప్రజలదని, మా ప్రజలు తలుచుకుంటే ప్రకాష్ గౌడ్‌ ఎంత? అన్నారు. ఆయన మంత్రి కెటి రామారావు పైన ధ్వజమెత్తారు.

ఈ గడ్డపైనే పుట్టా, వారే అతిథులు: నారా లోకేష్

ఇక్కడే (హైదరాబాద్) పుట్టానని, ఇక్కడే చదువుకున్నానని, ఇదే నా ఊరు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బుధవారం అన్నారు. తనను అతిథి అన్నవారే నగరానికి అతిథులని, తాను మాత్రం ఇక్కడి వాణ్నేనని అని మంత్రి కెటిఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్‌ బుధవారం జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో నిర్వహించిన రోడ్‌ షోలలో పాల్గొని ప్రసంగించారు. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని, ఇక్కడ బస్తీల్లో తిరిగి గాలిపటాలు కొన్నానని, కేటీఆర్‌ గుంటూరులో చదివారని, అతనే నగరానికి అతిథి అని వాఖ్యానించారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే మెట్రోరైల్‌ నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు. అమరావతిని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళుతోందని తెలిపారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా కేసీఆర్‌ హామీలే తప్ప చేసింది శూన్యమన్నారు.

కృష్ణా జలాలను నగరానికి తీసుకురావడానికి టిడిపి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టిడిపియే అన్నారు. గ్రేటర్‌లో తెరాసను గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందంటూ కొందరు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఇందులో నిజం లేదన్నారు.

అంతకుముందు మంత్రి కెటిఆర్.. లోకేష్‌కు చురకలు అంటించిన విషయం తెలిసిందే. తమ్ముడూ లోకేష్.. రాజధాని అమరావతికి నిధులు తెచ్చుకోవాలని, మోడీ ఇచ్చిన చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టి సరిపోదని, హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్ చూసుకుంటారని, మీరు అమరావతిని చూసుకోవాలని అన్నారు. దీనికి లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

నారా లోకేష్

నారా లోకేష్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ మంత్రి కెటిఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. తాను ఇక్కడే పుట్టానని, ఇక్కడే చదువుకున్నాని, ఇదే తన ఊరు అన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్‌ బుధవారం జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో నిర్వహించిన రోడ్‌ షోలలో పాల్గొని ప్రసంగించారు.

నారా లోకేష్

నారా లోకేష్

నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని, ఇక్కడ బస్తీల్లో తిరిగి గాలిపటాలు కొన్నానని, కేటీఆర్‌ గుంటూరులో చదివారని, అతనే నగరానికి అతిథి అని లోకేష్ అన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళుతోందని లోకేష్ తెలిపారు.

నారా లోకేష్

నారా లోకేష్

తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా... కేసీఆర్‌ హామీలే తప్ప చేసింది శూన్యమని లోకేష్ విమర్శించారు.

నారా లోకేష్

నారా లోకేష్

గ్రేటర్‌లో తెరాసను గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందంటూ కొందరు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఇందులో నిజం లేదని లోకేష్ అన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

కేంద్రం సహకారంతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిధులు రప్పిస్తామని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+