వీడిన టెక్కీ రాకేష్ రెడ్డి హత్య కేసు మిస్టరీ: బాబాయ్ పనే

హైదరాబాద్: హైదరాబాదు నగర శివారులోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రాకేశ్‌రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. సమీప బంధువే రాకేశ్‌రెడ్డిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి వివరాలను వెల్లడించారు.

ఈ నెల 23న ఇంటినుంచి బయటకు వెళ్లిన రాకేశ్‌రెడ్డి కిడ్నాప్‌నకు గురైనట్లు అతడి తండ్రి బాల్‌రెడ్డి కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటిరోజే రాకేశ్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. అయితే, హత్యచేసింది అతడి బాబాయి శ్రీధర్‌రెడ్డిఅని తేలింది. శ్రీధర్‌రెడ్డి ప్లేస్‌మెంట్ సర్వీస్ పేరిట ఉద్యోగాలిపిస్తామంటూ అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు రాకేష్‌రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడాలని అనుకున్నారు.

Techie Rakesh Reddy's murder case busted

ఈ మేరకు సాకేత్ రూమ్‌లో రాకేశ్ నిద్రపోతున్న సమయంలో అతడి ఫోన్ తీసుకున్నాడు. అందులో నుంచి రాకేశ్ తండ్రి బాల్‌రెడ్డికి నీ కూతురిని కిడ్నాప్ చేయాలనుకున్నానని, కానీ, కొడుకు రాకేష్ దొరికాడని, రూ.8లక్షలు కావాలని మెసేజ్ చేశాడు.

అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని బాల్‌రెడ్డి తిరిగి మెసేజ్ పంపాడు. అయితే, రాకేష్‌ను హతమారుస్తామని శ్రీధర్‌రెడ్డి హెచ్చరించాడు. అయితే, రాకేశ్‌రెడ్డి ఫోన్ నుంచి మెసేజ్ పంచించింది తానేనని తెలుస్తుందన్న అనుమానంతో రాకేష్‌రెడ్డిని కత్తితో గోంతుకోసి చంపేశాడు.

Techie Rakesh Reddy's murder case busted

తర్వాత తనకేమి తెలియనట్లు నటిస్తూ మూర్ఛరోగం ఉన్నట్లు డ్రామా చేయటంతో పోలీసులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయట పడినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడి ఐడీకార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+