Teenmar Mallanna : చంచల్‌గూడ జైలుకు తీన్మార్ మల్లన్న-14 రోజుల రిమాండ్-కస్టడీ కోరిన పోలీసులు
యూట్యూబ్ ఛానెల్ 'క్యూ' న్యూస్ నిర్వాహకుడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు మల్లన్నను చంచల్ గూడా జైలుకు తరలించారు. సెప్టెంబర్ 9 వరకు మల్లన్న రిమాండులో ఉండనున్నారు.
మల్లన్న తరుపు న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. అంతకుముందు,వాదనల సందర్భంగా మల్లన్నపై పెట్టిన కేసుల పట్ల ఉమేష్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్లన్న ఆత్మహత్యాయత్నం చేయలేదని... అలాంటప్పుడు ఐపీసీ సెక్షన్ 306,511 ఎలా పెడుతారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.చిలకలగూడా పోలీసులు మల్లన్నను 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. దీనిపై కోర్టు నిర్ణయం తెలియాల్సి ఉంది.

కోర్టు విచారణ అనంతరం మల్లన్న తరుపు న్యాయవాది ఉమేష్ చంద్ర మీడియాతో మాట్లాడారు. కేసు విచారణ వర్చువల్‌గా జరిగినట్లు తెలిపారు. మల్లన్నపై ఐపీసీ సెక్షన్లు 387,504,306,511ల కింద కేసులు పెట్టినట్లు తెలిపారు. సెక్షన్ 306 ఈ కేసులో వర్తించదని... కాబట్టి మల్లన్న రిమాండును తాము వ్యతిరేకిస్తున్నామని కోర్టుకు చెప్పినట్లు తెలిపారు. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో 60 రోజుల్లోగా బెయిల్ వస్తుందని... అంతకన్నా ముందే తాము బెయిల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు తనపై తీన్మార్ మల్లన్న తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాడని ఈ ఏడాది ఏప్రిల్‌లో చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన నుంచి రూ.30లక్షలు మల్లన్న డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మల్లన్నను పలుమార్లు పీఎస్‌కు పిలిపించి విచారించారు. శుక్రవారం(ఆగస్టు 27) రాత్రి మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మల్లన్నపై మల్లన్నపై చిలకలగూడ పోలీస్ స్టేషన్‌తో సైబర్ క్రైమ్ స్టేషన్,చిక్కడపల్లి,జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇటీవల టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ... చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. చట్టపరంగా మల్లన్నపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరినట్లు తెలిపారు. ఇకనైనా పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. పద్దతి మార్చుకోకపోతే తాము మల్లన్న కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందన్నారు.
Recommended Video
మల్లన్న ఈ నెల 29 నుంచి పాదయాత్ర ప్లాన్ చేసుకున్నారు. నిజానికి ఆలంపూర్ నుంచి ప్రారంభించాల్సిన ఈ పాదయాత్ర అనూహ్యంగా హుజురాబాద్‌కు మార్చినట్లు చెబుతున్నారు. మల్లన్న పాదయాత్రను అడ్డుకునేందుకే ఆయన్ను అరెస్ట్ చేశారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. గత కొద్దిరోజులుగా మల్లన్న ఏదో ఒక కేసులో తరుచూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో ఆయన అరెస్ట్ జరగడం గమనార్హం.తాను జైలుకు వెళ్లడానికి సిద్దమని... భవిష్యత్తులో కేసీఆర్ ఇంతకింత అనుభవించేలా చేస్తానని గతంలో మల్లన్న సవాల్ విసిరారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications