ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. వారిద్దరి రాయబారం
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపులు తీసుకుంటోంది. ఎస్ఐబీలో ఓఎస్ డీలుగా ఉన్న ఇద్దరు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరిద్దరూ ఇంతవరకు పోలీసుల ముందుకు రాలేదు. ఇప్పటికీ వీరు ఓఎస్డీలుగానే కొనసాగుతున్నారు. అప్రూవర్స్ గా మారిపోతామనడమే దీనికి కారణమని భావిస్తున్నారు. దీంతో దర్యాప్తు అధికారులు కూడా వీరిపై పెద్దగా దృష్టిసారించకపోవడంతోపాటు విచారణకు హాజరు కావాలనే నోటీసులు కూడా ఇవ్వడంలేదంటున్నారు.
అయితే ఒక ఓఎస్ డీ మాత్రం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరైనట్లు వార్తలు వచ్చాయికానీ దర్యాప్తు అధికారులు మాత్రం రాలేదని తెలిపారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఇతని పేరు వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం పిలవలేదు. దీనికి ప్రధాన కారణం.. తాను విట్ నెస్ గా మారతానంటూ మధ్యవర్తులద్వారా రాయబారం పంపడమే. ఈ కేసు కోర్టులో కూడా బలంగా నిలబడాలన్నా, నిందితులు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం శిక్ష పడాలన్నా ఇటువంటి విట్ నెస్ లు అవసరం. దీంతో పోలీసులు సైలెంట్ అయ్యారంటున్నారు.

ఎస్ఐబీలో ఓఎస్డీగా చేరిన ప్రభాకర్ రావుకు శిష్యుడిగా పేరుపడ్డ అధికారి ఒకరు విట్ నెస్ గా మారనున్నారంటున్నారు. ఎస్ఐబీలోని ఇద్దరు ఓఎస్డీలు ఇచ్చిన సమాచారంతోనే వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక డెన్ల గురించి పోలీసులు వివరాలు సేకరించారు. వారిచ్చిన సమాచారం ప్రకారం కొంతమందిని పిలిపించిన పోలీసులు వారి స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. జరిగింది మొత్తం చెబుతామని, ఎవరి ఫోన్లు ట్యాప్ చేశామో చెబుతామంటూ సాక్షులుగా మారి వారిపై కేసులు లేకుండా చూసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. దర్యాప్తులో భాగంగా వీరిద్దరి పేర్లను మాత్రం అధికారులు బయటకు రానివ్వడంలేదు. వీరిద్దరూ విట్ నెస్ లయ్యారనే ప్రచారాన్ని నమ్మాలని పోలీసుల వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications