నోటుకు ఓటుకు కేసు: టిడిపి ఎమ్మెల్యే సండ్రకు ఎసిబి నోటీసు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్న వారికి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఎసిబి అధికారులు వెళ్లిన సమయంలో సండ్ర వెంకట వీరయ్య నివాసంలో లేరు. దీంతో హైదరాబాదులోని హైదర్‌గుడాలో గల సండ్ర ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద సండ్రకు నోటీసులు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. మరో ఇద్దరికి ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వారిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర గెలుపొందారు.
ఈ కేసులో మరింత మందికి ఈ రాత్రి లేదా రేపు బుధవారం ఉదయం ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సండ్ర వెంకట వీరయ్యకు కూడా ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపిన వ్యవహారంలో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications