వామ్మో.. తెలంగాణ ఎమ్మెల్యేల జీతం తెలిస్తే షాక్..! సంచలన సర్వే బయటకు..

ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల జీతాన్ని వంద శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో కర్ణాటకలో సీఎం, ఎమ్మెల్యేల జీతాలు డబుల్ కానున్నాయి. మరి తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..? దేశంలో ఏ రాష్ట్ర ఎమ్మెల్యేలు అత్యధిక జీతం తీసుకుంటునారు..? అతి తక్కువ వేతనం తీసుకుంటున్న ఎమ్మెల్యేల రాష్టం ఏది..? ఇలాంటి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

ఎమ్మెల్యేలు ఎంత జీతం తీసుకుంటారో తెలుసుకోవాలని ఉందా..? వారి వేతనం ఎంత, అలవెన్సులు, ట్రావెల్ అలవెన్సు, టెలిఫోన్, కరెంట్ బిల్లుల అలవెన్లులు ఎలా ఉంటాయి..? తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ రిపోర్టు ప్రకారం ఒక్కో రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతం మారుతూ ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్రలోని ఎమ్మెల్యేలు అత్యధికంగా నెలకు రూ. 2.5 లక్షల వరకు జీతం ఉంటుంది. అయితే కేరళలో మాత్రం ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం కేవలం రూ. 70,000 లే కావడం గమనార్హం. మహారాష్ట్రలోని ఎమ్మెల్యేకు బేసిక్ శాలరీ రూ. 1.82 లక్షలు ఉండగా.. కేరళలోని ఎమ్మెల్యేకు బేసిక్ శాలరీ కేవలం రూ. 2వేలు ఉండటం సంచలనంగా మారింది. దీన్ని బట్టి ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా వేతనం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Telangana and Maharashtra MLAs Top the Country in Salary Kerala at the Bottom

దేశ రాజధాని దిల్లీలో ఎమ్మెల్యేల వేతనాన్ని 2023 ఫిబ్రవరిలో సవరించారు. ప్రస్తుతం దిల్లీ ఎమ్మెల్యేల జీతం ఒక్కొక్కరికి రూ. 90,000 లుకా ఉంది. బేసిక్ పే 30వేలు, నియోజకవర్గ అలవెన్సు రూ.25 వేలు, సెక్రటేరియల్ అలవెన్సు రూ. 15వేలు, కన్వీయెన్స్ అలవెన్సు రూ. 10వేలుగా ఉంది. జీతం రూ. 90 వేలు కాకుండా డెయిలీ అలవెన్సు కింద ఒక్కో ఎమ్మెల్యేకు రోజుకు రూ. 1500 వస్తాయి. ఇక గుజరాత్ లో ఒక్కో ఎమ్మెల్యే జీతం నెలకు రూ. 78,800. పర్సనల్ అసిస్టెన్స్ అలవెన్సు రూ. 20 వేలు, టెలీఫోన్ అలవెన్సు రూ. 7వేలు, పోస్టల్ అండ్ స్టేషనరీ అలవెన్సు రూ. 5వేలు ఉంటుంది. గుజరాత్ ఎమ్మెల్యేలకు డెయిలీ అలవెన్సు కింద రోజుకు రూ. 1000 వస్తాయి.

యూపీ, మహారాష్ట్రలో ఎలా..

మహారాష్ట్రలో ఎమ్మెల్యేల జీతం దేశంలోనే అత్యధికం. ఈ రాష్ట్రంలో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.1,82,200 అందుతుంది. డియర్ అలవెన్సు రూ. 51,016, టెలిఫోన్ అలవెన్సు రూ. 8,000, స్టేషనరీ అండ్ పోస్టేజ్ అలవెన్సు రూ.10,000, కంప్యూటర్ ఆపరేటర్ అలవెన్సు రూ. 10,000 ఉంటాయి. ఇక డెయిలీ అలవెన్సు కింద ప్రతి ఎమ్మెల్యేకు రూ. 2వేలు లభిస్తాయి. ఇక ఉత్తర్ ప్రదేశ్ యోగి ప్రభుత్వంలోని ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం రూ. 96,500 గా ఉంది. ప్రతి ఎమ్మెల్యేకు నియోజకవర్గ అలవెన్సు కింద రూ. 50వేలు అందుతాయి. సెక్రటేరియల్ అలవెన్సు రూ. 20,000, ట్రావెల్ అలవెన్సు రూ. 1,500 వీటితోపాటు అసెంబ్లీకి హాజరు అయిన ప్రతి ఎమ్మెల్యేకు రోజుకు రూ. 2వేలు అందుతాయి.

Take a Poll

పంజాబ్ లో ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి నెల రూ. 25వేలు ఫిక్స్ డ్ శాలరీ ఉంటుంది. దీంతో పాటు నియోజకవర్గ అలవెన్సు కింద రూ. 25,000 సెక్రటేరియల్ అండ్ పోస్టల్ అలవెన్సు కింద రూ. 15,000 టెలిఫోన్ అలవెన్సు రూ. 15వేలు, ఆఫీస్ అలవెన్సు రూ. 10వేలు గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+