మాకు చెప్పలేదు: కేసీఆర్‌కు కేంద్రం ఝలక్, బాబుకు అవకాశం
న్యూఢిల్లీ: ప్రాజెక్టుల విషయంలో కేంద్ర జలసంఘం తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాకిచ్చింది. పాలమూరు - రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల సాంకేతిక అనుమతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలనూ తమకు అందచేయలేదని కేంద్ర జలసంఘం పేర్కొంది.
నీటి వనరుల అంచనా, వినియోగం తదితర వివరాలతో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల వివరాలు ఏవీ కేంద్ర జలసంఘం వద్ద కానీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్ద కానీ, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ వద్ద కానీ లేవని సుప్రీం కోర్టుకు నివేదించింది.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు - రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల వల్ల తమకు నష్టం కలుగుతుందని, వాటిని అడ్డుకోవాలని కోరుతూ ఏపీకి చెందిన ఆళ్ల వెంకట గోపాల కృష్ణ రావు, మరికొందరు రైతులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనికి ప్రమాణపత్రం దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించగా, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తరఫున కేంద్ర జలసంఘం ఈ మేరకు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. ఇప్పటికే, ప్రాజెక్టుల విషయంలో కెసిఆర్, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
కాగా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ, జలసంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్ద ఈ ప్రాజెక్టుల నీటి వనరుల అంచనా, వినియోగానికి సంబంధించి ప్రతిపాదన ఏదీ లేదని, తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలనూ సాంకేతిక అనుమతి కోసం బోర్డుకు సమర్పించలేదని పేర్కొన్నారు.
వాటిని ఇవ్వాలని కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి సూచించిందని, ఈ రెండు ప్రాజెక్టులు ఏపీ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో పేర్కొనలేదన్నారు.
పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిలోని ప్రాజెక్టులను నోటిఫై చేయడమే కేంద్రం పరిధి అని, ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను నోటిఫై చేయాల్సిన అవసరం లేదని ప్రమాణ పత్రంలో పేర్కొంది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాలని, కానీ తెలంగాణ దానిని సమర్పించలేదని తెలిపింది.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications