నాలుగో రోజుకు తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు; పద్దులపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.శుక్రవారం శాసన సభలో బడ్జెట్ పద్దులపై రెండవ రోజు చర్చ జరగనుంది. ఈరోజు శాసనసభలో వ్యవసాయం, సహకారం, పశుసంవర్ధక శాఖ కు సంబంధించిన పద్దులపై శాసనసభ్యులు చర్చలు జరపనున్నారు. అంతేకాదు రెవిన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ, రవాణా, పౌరసరఫరాలు, హోం శాఖకు సంబంధించిన పద్దులపై కూడా చర్చించనున్నారు.
పద్దులపై చర్చలో భాగంగా సభ్యుల సందేహాలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే పద్దుల పై చర్చ గురువారం నాడు ప్రారంభం కాగా గురువారం అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంత్రి కేటీఆర్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ విమర్శలు చేయగా సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సంస్కారం కాదు అంటూ భట్టివిక్రమార్క అడ్డు చెప్పారు. బిజెపి సభ్యుల సస్పెన్షన్ పై ఆ పార్టీ అధ్యక్షుడు కంటే కాంగ్రెస్ తెలంగాణా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్కువ బాధపడ్డారని, ఎందుకో తమకు అర్థం కాలేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క ఖండించారు.

ఇక బడ్జెట్లో కేటాయింపులు జరిగినా, ఆ తర్వాత మళ్లీ తగ్గించడం పరిపాటిగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల శాఖలకు కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించినప్పుడు ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుతుందని సీతక్క పేర్కొన్నారు. పూర్తిగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కేటాయింపులు చేయాల్సిన అవసరం కూడా ఉందని సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక పద్దులపై చర్చలో భాగంగా మంత్రి కేటీఆర్ కేంద్రం తీరు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర ప్యాకేజీ అంతా బోగస్ అంటూ ఆయన మండిపడ్డారు. అయితే జూమ్లా లేకపోతే హమ్లా అన్నట్టుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నిన్న విమర్శలు ప్రతి విమర్శలతో కొనసాగిన సభాపర్వం మళ్లీ నేడు పద్దులపై చర్చలతో కొనసాగనుంది. ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఏడవ తేదీన ప్రారంభమయ్యాయి. మంత్రి హరీష్ రావు మూడవసారి బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బడ్జెట్‌లో ఆయా శాఖలకు కేటాయింపులపై, పద్దులపై సభ్యుల చర్చ జరుగుతుంది
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications