తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు షురూ!!

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను షురూ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలోగా జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం సమాయత్తమైన భారత ఎన్నికల కమిషన్ ఈనెల 22వ తేదీన హైదరాబాద్ కు రానుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో 22వ తేదీ నుండి మూడు రోజులపాటు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.

ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ రాజ్ పోలీసు డైరెక్టర్ జనరల్ అంజనీకుమార్, జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలతో అసెంబ్లీ ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాలలో పోలీసు, రెవిన్యూ అధికారులదే కీలక పాత్ర అని అన్నారు.

Telangana assembly elections arrangements started in telangana!!

ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల ఏర్పాటుతోపాటు ఎన్నికల సిబ్బందిని సమాయత్తం చేయాలని తెలిపారు. జిల్లాలలో గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఓటింగ్ తక్కువ జరిగిన నమోదయిన ప్రాంతాల్లో ఓటరు ప్రాముఖ్యత కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు.సమస్యత్మకా ప్రాంతాలలో ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిచాలని అన్నారు.

ఎన్నికల సమయంలో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు సృష్టించే విధంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు సకాలంలో తిప్పికొట్టే విధంగా సోషల్ మీడియా బృందాలను నియమించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ లో ప్రజల కు ఖచ్చితమైన, ప్రామాణికమైన సమాచారం ఇవ్వడం అధికారుల భాద్యత అని అన్నారు.

ఎన్నికలలో వివిధ పిర్యాదులను స్వీకరిం చడానికి ఎన్నికల టోల్ ఫ్రీ నెంబర్ 1950 ని కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే నియోజకవర్గాలను ఆధారంగా లిస్ట్ లను రూపొందించాలని సూచించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయాలి అని అన్నారు.

ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, విధులపై అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు.ఇక మరోవైపు జిల్లాలలోనూ ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టారు అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+