రంగంలోకి దిగుతున్న బీఆర్ఎస్ అధినేత: 15 నుంచి హోరెత్తించినున్న కేసీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడులైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఇక బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందున్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈనెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి నవంబర్ 9 వరకు బీఆర్ఎస్ అధినేత సభలకు షెడ్యూల్ ఖరారైంది. రోజుకు రెండు లేదా మూడు సభల్లో కేసీఆర్ పాల్గొనేలా బీఆర్ఎస్(BRS) నేతలు షెడ్యూల్ సిద్ధం చేశారు.

ముందుగా హుస్నాబాద్‌లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార భేరీ మోగించడం గమనార్హం. ఈసారి సభకు భారీ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరిలో జరిగే సభల(Public Meetings)కు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 17న సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్:
అక్టోబర్ 15 హుస్నాబాద్
అక్టోబర్ 16 జనగాం, భువనగిరి
అక్టోబర్ 17 సిరిసిల్ల, సిద్దిపేట
అక్టోబర్ 18 జడ్చర్ల, మేడ్చల్
అక్టోబర్ 26 అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు
అక్టోబర్ 27 పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్
అక్టోబర్ 29 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్ 30 జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్
అక్టోబర్ 31 హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్ 01 సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్ 02 నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
నవంబర్ 03 భైంసా(ముధోల్), ఆర్మూర్, కోరుట్ల
నవంబర్ 05 కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్ 06 గద్వాల్, మఖ్తల్, నారాయణపేట
నవంబర్ 07 చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్ 08 సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి
ఒకే రోజు రెండుచోట్ల నామినేషన్లు
సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు కేసీఆర్. ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications