రేవంత్ Vs కేసీఆర్, కీలక నిర్ణయం- ఇక తేల్చుడే..!!

తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు కేసీఆర్ సైతం రేవంత్ కు ధీటుగా తన ప్రణాళికలతో సిద్దం అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ను కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఇతర పక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తదుపరి నిర్ణయాలకు రెడీ అయ్యారు. దీంతో.. అసెంబ్లీ వేదికగా ఈ అంశం పైన కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయించింది. అంతకు ముందు రోజు అంటే 29వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమీషన్‌ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే సభ్యులందరికీ కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం అందించనుంది. కాగా, అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. కాళేశ్వరం పైన చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోనుంది.

telangana-assembly-special-session-to-begin-on-30th-of-this-month-details-here

కాగా, ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు మొదటి రోజు సభలో సంతాపం ప్రకటించనున్నారు. ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎంపిక జరగనుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఎస్టీ వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పుడు అధికారికంగా ఎంపిక జరగనుంది. ఇక.. తాజాగా న్యాయస్థానంలో కాళేశ్వరం రిపోర్టు పై కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్ లో ప్రభుత్వం తాము అసెంబ్లీలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించిది. ఈ మేరకు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ జరగనుంది. కాగా, కీలకమైన కాళేశ్వరం పైన చర్చకు కేసీఆర్ సభకు హాజరు కానున్నట్లు సమాచారం. దీంతో.. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైన అటు రేవంత్.. ఇటు కేసీఆర్ టీంల మధ్య ఆసక్తి కర చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+