Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా బంద్.. కవిత ఏమన్నారంటే!

తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల సాధన కోసం వివిధ బీసీ సంఘాలు, బిసి రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 14వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ ను నిర్వహించాలని మొదట ప్రకటించి ఆపై వాయిదా వేసిన బీసీ జేఏసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలంగాణరాష్ట్ర బంద్ ను 18వ తేదీన చేయనున్నట్టు వెల్లడించారు.

బీసీ రిజర్వేషన్ కోసం రేపు తెలంగాణా బంద్
ఈ బంద్ కు ఆయన కవిత మద్దతు కోరటంతో కవిత బంద్ పై స్పందించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం ఆందోళన ఉధృతం చేయటంలో భాగంగా రేపు బంద్ కు పిలుపునిచ్చింది బీసీ జేఏసీ. తెలంగాణ రాష్ట్రంలో బిసి హక్కుల సాధన కోసం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం చేపట్టిన ఈ ఆందోళన, బలమైన ఉద్యమంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్నారు.

Telangana bandh tomorrow What did kalvakuntla Kavitha say

Take a Poll

కవితకు ఆర్ కృష్ణయ్య లేఖ
తద్వారా రిజర్వేషన్ల విషయంలో సవరణలు చేయవలసిన అవసరం ఉంటుందని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్ ను సక్సెస్ చేస్తే బీసీల ఐక్యత కేంద్రానికి తెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు బంద్ కు మద్దతు ఇవ్వవలసిందిగా లేఖ రాశారు.

బంద్ ఫర్ జస్టిస్ పేరు మీద రాష్ట్ర బంద్
స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై జాయింట్ యాక్షన్ కమిటీ ని ఏర్పాటు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టు ఇచ్చిన స్టే కు నిరసనగా 18వ తేదీ బంద్ చెయ్యాలని నిర్ణయించామని ఆ లేఖలో పేర్కొన్నారు. బంద్ ఫర్ జస్టిస్ అనే పేరు మీద బంద్ జరపాలని నిర్ణయించామని తెలిపారు.

తెలంగాణా బంద్ పై కవిత ఏమన్నారంటే
ఇప్పటికే మీరు బీసీ రిజర్వేషన్ల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి రేపు జరిగే బంద్ కు తెలంగాణ జాగృతి పక్షాన మద్దతు తెలపాలని ఆర్ కృష్ణయ్య కవితకు లేఖ రాశారు. ఇక దీనిపైన స్పందించిన కవిత అక్టోబర్ 18న బంద్ ఫర్ జస్టిస్ పేరుతో చేపట్టే బంద్ కు మద్దతు తెలపాలని కోరిన తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ లపై కవిత అసహనం
తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్లో పెట్టిన బిజెపి ఇప్పుడు బంద్ లో పాల్గొంటుందని అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు అసెంబ్లీ, కౌన్సిల్లో బిల్లులు పాస్ చేసి కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తామే ముందుండి బంద్ చేయిస్తాం అనడం హాస్యాస్పదం అంటూ కవిత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+