తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యేల త్రయం 'ఆర్ఆర్ఆర్' అరెస్ట్!!
పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీతో లింక్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. బిజెపికి చెందిన కీలక నాయకులు ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్ :బండి సంజయ్ అరెస్ట్ వివరాలు తెలుసుకోవడానికి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే రఘునందన్ రావు పై పోలీసులు విరుచుకుపడ్డారు. రఘునందన్ రావు ను చొక్కా పట్టి బలవంతంగా లాగి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లిన పోలీసుల తీరుతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలన్న రఘునందన్ రావుకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై మండిపడిన రఘునందన్ రావు బండి సంజయ్ అరెస్ట్ విషయంలో డిసిపి ని కలవడానికి వస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. తన వద్ద తుపాకీ ఉందని... మీ చేష్టల వల్ల మిస్ ఫైర్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నా వినకుండా రఘునందన్ ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్ :ఇదిలా ఉంటే హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట శామీర్ పేట లోని ఈటల రాజేందర్ ఇంటికి వచ్చిన పోలీసులు, బండి సంజయ్ అరెస్ట్ నేపధ్యంలో బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్ కు వెళ్ళడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. దీంతో బిజెపి రాష్ట్ర ఆఫీసుకి వెళుతుండగా హకీం పేటలో ఈటల రాజేందర్ ను అడ్డుకున్న పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్టు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇక బండి సంజయ్ అరెస్టుపై భగ్గుమన్న ఈటల రాజేందర్ ఒక ఎంపీనీ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. కెసిఆర్ చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు . పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పు దోవపట్టించడానికి నిదర్శనం బండి సంజయ్ అరెస్ట్ అన్నారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యేల త్రయం 'ఆర్ఆర్ఆర్' అరెస్ట్..!!#bandisanjay #etelarajdner #bjp #telanganabjp #bandisanjayarrest #oneindiatelugu pic.twitter.com/BOQR2UpKqt
— oneindiatelugu (@oneindiatelugu) April 5, 2023
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ :కాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో బొమ్మలరామారం వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర సమీపంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ను అడ్డుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల అరెస్టులతో, రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నేతల గృహ నిర్బంధాలతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications