అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తొలి సమావేశం: మోడీ పర్యటనపై నేతలకు దిశానిర్దేశం

న్యూఢిల్లీ: తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో జులై 8న ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశానికి ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బాబు మోహన్, బూర నర్సయ్యగౌడ్, ఏవీఎన్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, నందీశ్వర్ గౌడ్, కూన శ్రీశైలంగౌడ్, రాణి రుద్రమ తదితరులు హాజరయ్యారు. కాగా, బీజేపీ అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి నిర్వహించిన తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం.

 telangana bjp president Kishan reddy meeting with state leaders; discussed on pm modi tour

కాగా, అంతుకముందు హైదరాబాద్ చేరుకున్న కిషన్ రెడ్డికి బీజేపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈటల రాజేందర్ సహా పలువురు బీజేపీ నేతలు శంషాబాద్ విమానాశ్రయం వెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయం నుంచి కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌కు వెళ్లారు. ప్రధాని మోడీ వరంగల్ పర్యటనపై కీలకంగా చర్చించారు. మోడీ పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు సూచించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని, తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. అంతకుముందు పార్టీ అధిష్టానం సూచనలతో బండి సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాజాగా, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ అధిష్టానం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలోనే కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి.. బుధవారం రాత్రి తిరికి హైదరాబాద్ వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+