Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా బడ్జెట్ హైలైట్స్: బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట; కేసీఆర్ మార్క్ బాహుబలి బడ్జెట్ కేటాయింపులిలా!!

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 2023 - 2024 ఆర్థిక సంవత్సరానికి 2,90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు, పెట్టుబడి వ్యయం 37,525 కోట్లు.

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 2023 - 2024 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందు సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. గతేడాది మార్చిలో 2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టగా ఈ సంవత్సరం 2. 90 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రతిపాదించారు.

అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు

అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు

2023 - 2024 ఆర్థిక సంవత్సరానికి 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మంత్రి హరీష్ రావు. రెవెన్యూ వ్యయం 2, 11,685 కోట్లు కాగా, పెట్టుబడి వ్యయం 37,525 కోట్లుగా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 2023 - 24 తలసరి ఆదాయం మూడు లక్షల 17 వేల 175 రూపాయలుగా ఉందని పేర్కొన్న మంత్రి హరీష్ రావు వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులను వివరించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులలో పెద్దపీట వేసినట్టుగా 26,831 కోట్లను కేటాయించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగానికి 12,161 కోట్లు కేటాయించారు. పల్లె ప్రగతి పంచాయతీరాజ్ శాఖకు 31,426 కోట్లు కేటాయించారు.

వివిధ శాఖలకు, పథకాలకు కేటాయింపులు ఇలా

వివిధ శాఖలకు, పథకాలకు కేటాయింపులు ఇలా

మున్సిపల్ శాఖకు 11372 కోట్లు, నీటిపారుదల రంగానికి 26,831 కోట్లు, రైతు వేదికలకు 26,835 కోట్లు, విద్యుత్ రంగానికి 12,727 కోట్లు, ఇరిగేషన్ రంగానికి 26,885 కోట్లు, విద్యా రంగానికి 19, 093 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. ప్రజా పంపిణీ రంగానికి 3117 కోట్లు, ఆసరా పెన్షన్లకు 12,000 కోట్లు, దళిత బంధుకు 17,700 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 6,229 కోట్లు, షెడ్యూల్డ్ తెగలకు 15,233 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 2,200 కోట్లు, గిరిజన సంక్షేమానికి 3,965 కోట్లు, పరిశ్రమలకు 4,037 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.

అన్ని రంగాలకు, పథకాలకు ప్రాధాన్యతనిస్తూ సాగిన బడ్జెట్ ప్రసంగం


హరితహారానికి 14, 071 కోట్లు, గ్రామాలలో రోడ్ల కోసం 2,000 కోట్లు, రవాణా శాఖకు 1,644 కోట్లు, హోం శాఖకు 9,599 కోట్లు, ఐ అండ్ పి ఆర్ కోసం వెయ్యి కోట్లు, షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతినిధికి 36,750 కోట్లు, పాతబస్తీ మెట్రో కనెక్టివిటీకి 500 కోట్లు, మూసి అభివృద్ధి కోసం 200 కోట్లు, మహిళా యూనివర్సిటీ కి వంద కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు 500 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 2000 కోట్లు, రవాణా శాఖకు 1644 కోట్లు, టి ఎస్ ఆర్ టి సి కి 1500 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 3001 కోట్లు, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి 1200 కోట్లు, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ కు 200 కోట్లు, కల్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి పథకాలకు 3210 కోట్లు, కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

బడ్జెట్ ప్రసంగంలో కేంద్రంపై విరుచుకుపడిన మంత్రి హరీష్ రావు

బడ్జెట్ ప్రసంగంలో కేంద్రంపై విరుచుకుపడిన మంత్రి హరీష్ రావు


ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రం నిధులకు కోత పెడుతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంవత్సరం ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ కీలక బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు మంత్రి హరీష్ రావు. సంక్షేమానికి, పేదరిక నిర్మూలనకు, అభివృద్ధికి ప్రధానంగా ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+