నేటినుండి తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: కీలక బిల్లులు, తీర్మానాలు.. వ్యూహమిదే!

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడం కోసం బషీర్ బాగ్, నాంపల్లి, రవీంద్ర భారతి పరిసరాలలో మూడంచెల భద్రత ఏర్పాట్లను చేశారు. ఈరోజు శాసనసభ సమావేశ మందిరంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున్నారు. గవర్నర్ ప్రసంగంతో ఈరోజు సమావేశాలు ప్రారంభమవుతాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రగతి పైన గవర్నర్ ప్రసంగం
ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయసభలలో సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి పైన గవర్నర్ తన ప్రసంగంలో వివరిస్తారు. దాదాపు గంటపాటు గవర్నర్ ప్రసంగం సాగుతుంది. ఆపై తర్వాత రోజుకు సభ వాయిదా పడుతుంది. ఇక శాసనసభ వ్యవహారాల కమిటీ బిఎసి సమావేశం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరుగుతుంది.

Telangana budget sessions from today Key bills resolutions this is the strategy

తెలంగాణ బడ్జెట్ ఈ నెల 19వ తేదీన ప్రవేశపెట్టే అవకాశం
ఈ సభని ఎన్ని రోజులు నిర్వహించాలి అనేది ఈ భేటీలో నిర్ణయం తీసుకుంటారు. అయితే తెలంగాణ బడ్జెట్ మాత్రం ఈ నెల 19వ తేదీన ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు గవర్నర్ ప్రసంగం ఉండనుండగా, మార్చి 13వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన చర్చ జరుగుతుంది. ఇక మార్చి 14వ తేదీన హోలీ సందర్భంగా సెలవు దినం.

ఈ సమావేశాల్లో కీలక బిల్లులు, తీర్మానాలు
మార్చి 15వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు సభలో కులగణన సర్వే పైన చర్చ, ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ల బిల్లుల పైన చర్చలు, తీర్మానాలు ఉంటాయి అని సమాచారం. శాసనసభలో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లుతోపాటు, ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇక వీటిపైనే వాడి వేడిగా ఉభయ సభలలో చర్చ జరగనుంది.

బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్లాన్ ఇదే
రెండు వారాల పాటు సాగనున్న ఈ బడ్జెట్ సమావేశాలు మార్చి 27వ తేదీ వరకు కొనసాగుతాయి. అయితే ఈసారి శాసనసభ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం . సభలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఒకరోజు సభను వాయిదావేసి అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే స్థానిక సంస్థల ఎన్నికలకు
అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇక సంక్షేమ అభివృద్ధి ప్రధాన ఆస్త్రాలుగా అధికార పక్షం సిద్ధం కాగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వేదికగా విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+