Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాంప్రదాయానికి భిన్నంగా మేడారంలో తెలంగాణా మంత్రులంతా కలిసి.. రేవంత్ నిర్ణయం!

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 18వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో క్యాబినెట్ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మేడారం సాక్షిగా జరగనున్న కేబినేట్ భేటీపై ఆసక్తి నెలకొంది.

మేడారానికి సీఎం రేవంత్
ఈనెల 18వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఆపై సిపిఐ 100 ఏళ్ళ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రేవంత్ రెడ్డి మేడారం చేరుకుంటారు.

telangana cabinet meeting conducted by cm revanth reddy in medaram on january 18th

రానున్న మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికల నేపధ్యంలో కీలక చర్చ
ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా మేడారానికి చేరుకొని మేడారంలో జరిగే క్యాబినెట్ భేటీలో పాల్గొంటారు. 18వ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత మేడారంలో క్యాబినెట్ భేటీని నిర్వహించి కీలక విషయాల పైన చర్చ చేయనున్నారు. మేడారంలో జరగనున్న క్యాబినెట్ భేటీలో త్వరలో మున్సిపల్, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాల పైన వాటి నిర్వహణ పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు.

కేంద్ర బడ్జెట్ నేపధ్యంలో కీలక నిర్ణయాలు
అంతేకాదు ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో అందుకు తగినట్టు శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన పై సీఎం దిశా నిర్దేశం చేస్తారు. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్లు, ఇతర అంశాల పైన కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు.

సమ్మక్క, సారలమ్మల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం
మరుసటి రోజు ఉదయం మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దర్శనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం అవుతారు. అదే రోజు రాత్రి ఆయన దావోస్ కు బయలుదేరుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+