బీసీ రిజర్వేషన్లు, ఎన్నికలపై సుప్రీం తీర్పుతో ప్లాన్ మార్చిన సీఎం రేవంత్..!!

బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో పైన హైకోర్టు ఇచ్చిన స్టే పై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కాగా, ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టులో విచారణ సాగుతుందని స్పష్టం చేసింది. 50 శాతానికి లోబడి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. దీంతో.. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీ లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మెట్రో, రైతు భరోసాతో పాటుగా బీసీ రిజర్వేషన్లు.. స్థానిక ఎన్నికల పై కీలక నిర్ణయానికి సీఎం రేవంత్ సిద్దమయ్యారు.

తెలంగాణ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ అప్పీల్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రస్తుత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్దేశించింది. దీంతో, ఈ కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్ల అమలు పైన నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీంకోర్టులో సైతం సానుకూల నిర్ణయం రాకపోవటంతో.. పార్టీ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ ఆలోచనగా సమాచారం. ఈ మేరకు తన సహచర మంత్రులతో చర్చించి.. స్థానిక ఎన్నికల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

telangana-cabinet-to-take-decision-on-hyderabad-metro-and-local-body-elections

అదే విధంగా రైతు భరోసా స్కీమ్‌ రేవంత్‌ సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మైనింగ్ కొత్త పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్‌ ఉంది. రోడ్లు, మెట్రో రైల్‌ ఫేజ్-2 టెండర్లకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మెట్రో రైల్ ఫేజ్-2కు సంబంధించి రోడ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై కూడా కీలకంగా చర్చించనున్నారు. మూసీ ప్రాజెక్టు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ-ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాలు క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి. వివిధ సాగునీటి పారుదల ప్రాజెక్టుల అంచనాలను పెంచే అంశం పైనా చర్చించనున్నారు.

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం, సమ్మక్క-సారలమ్మ ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజీ వంటి విషయాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక.. తాజాగా తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పలువురు మంత్రుల వివాదాస్పద వైఖరిపై కేబినెట్‌ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించి హెచ్చరికలు జారీ చేసే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. ఈ కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ తీరు వివాదాల కు కారణంగా మారుతోంది. దీంతో.. సురేఖ నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+