తెలంగాణా- ఛత్తీస్‌గఢ్ NH163పై కేంద్రం మరో శుభవార్త!
తెలంగాణా రాష్ట్ర పురోభివృద్ధి కేంద్రం రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా కృషి చేస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా మీదుగా తెలంగాణా- చత్తీస్ గడ్ రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన హైదరాబాద్- భూపాలపట్నం 163 జాతీయ రహదారి అభివృద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
శరవేగంగా జాతీయరహదారి 163 నిర్మాణ పనులు
హైదరాబాద్ భూపాలపట్నం జాతీయరహదారి 163 నిర్మాణం చాలా వరకు జరిగింది. ఇంకా ఈ మార్గంలో అనేకచోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకు హన్మకొండజిల్లా కటాక్షా పూర్ వద్ద లోలెవల్ కాజ్ వే ఉంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ కాజ్ వే ముంపుకు గురై రాకపోకలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ క్రమంలో ఈ కాజ్ వే స్థానంలో వంతెన నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందని భావించి ఇక్కడ వంతెన నిర్మాణం చెయ్యాలని నిర్ణయించింది.

కటాక్షాపూర్ వంతెన నిర్మాణ భూసేకరణ నోటిఫికేషన్
అలాగే నీరుకుళ్ళ క్రాస్ వద్ద ప్రమాదకరంగా ఉన్న మూల మలుపును కూడా నేరుగా చేయటానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా తెలంగాణ ఛత్తీస్గడ్ రాష్ట్రాలను కలిపే 163 జాతీయ రహదారిలో ఉన్న కటాక్ష పూర్ వంతెన నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వంతెన నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని నిన్న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్రానికి ఆర్అండ్ బీ ప్రతిపాదనలు
దీంతో అధికార యంత్రాంగం భూసేకరణ పనులు మొదలుపెట్టనుంది. ఇప్పటికే కటాక్షపూర్ లోలెవెల్ కాజ్ వే ఉన్న చోట వంతెన నిర్మించడానికి సంవత్సరంన్నర క్రితం 312కోట్లను విడుదల చేయగా టెండర్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే వంతెనని వెడల్పుగా నిర్మించడానికి హౌజ్ బూజుర్గు, కటాక్షపూర్ గ్రామాల మధ్య కొంతమేర భూసేకరణ అవసరమైన నేపథ్యంలో భూసేకరణకు అనుమతి ఇవ్వాలని జాతీయరహదారుల ఆర్ అండ్ బి అధికారులు నెలరోజుల క్రితం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
పరకాల ఆర్డీవోకు భూసేకరణ బాధ్యతలు
నిన్న భూసేకరణకు కేంద్ర రహదారి రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.భూసేకరణ బాధ్యతలను పరకాల ఆర్డీవోకు అప్పగించింది. భూసేకరణకు సర్వే చేసి బాధిత రైతులకు పరిహారం ఇచ్చే విషయం పైన పరకాల ఆర్డిఓ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే వంతెన నిర్మాణాన్ని వెంటనే మొదలుపెట్టనున్నారు.












Click it and Unblock the Notifications