హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలో పాల్గొని అమర జవాన్లకు నివాళులర్పించారు.

గోల్కొండ కోటకు చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా పోలీసుల గౌరవ వందనం స్కీకరించారు. రాణీ మహాల వేదికగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణలో భాగంగా
సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో 28వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

ఎస్‌టీ, ఎస్‌టీ, మైనారిటీ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామని చెప్పారు. విద్యార్ధుల కోసం సన్న బియ్యం ప్రవేశపెట్టామని చెప్పిన ఆయన రాష్ట్రంలో పేద వర్గాల ప్రజల కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ లాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు.

 తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

త్వరలోనే దళితులకు భూ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని రైతాంగానికి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రూ. 17 వేల కోట్లు విడుదల చేశామని అన్నారు. రుణమాఫీ కింద రైతులకు రెండు విడుతల్లో రూ. 8,500 కోట్లు చెల్లించామని వెల్లడించారు.

 తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

గతంలో పెండింగ్‌లో ఉన్న 480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ప్రజలకు అందించామని చెప్పారు. రైతులకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 380 గోదాములను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. వీటి నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

హైదరాబాద్ నగరం చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్ హౌస్ కల్టివేషన్‌కు 250 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ధరల స్ధిరీకరణకు రూ. 400 కోట్లు విడదలు చేశామని తెలిపారు. విద్యుత్ రంగంలో గత 30 ఏళ్లుగా ఎన్నో కష్టాలను అనుభవించామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటన్నింటిని అధిగమించి కోతల్లేని కరెంట్‌ను ప్రసారం చేస్తున్నామని తెలిపారు.

 తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

వచ్చే మార్చి నుంచి వ్యవసాయానిక 9 గంటలు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని అన్నారు. విద్యుత్ రంగంలో తెలంగాణ మిగులు రాష్ట్రాంగా ఉండేందుకు గాను రూ. 90 వేల కోట్లు నిధులు సమకూర్చుకున్నామని అన్నారు. తెలంగాణలో అత్యుత్తమ నీటివనరులను కాకతీయ రాజులు ఏర్పాటు చేశారని కానీ ఏపీ పాలకుల పాలనలో అవి అడుగంటాయని అన్నారు.

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46 వేల చెరువులను పునరుద్దీకరణ చేపట్టామని తెలిపారు. ప్రతి ఏటా 9వేల చెరువులను పునరుద్దీకరణ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టిందని చెప్పిన ఆయన, ఈ ఏడాది 8వేల చెరువులను పునరుద్దీకరణ చేసినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

మిషన్ కాకతీయలో రైతులు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. మిచిగాన్ యూనివర్సిటీలో మిషన్ కాకతీయను ఓ అధ్యయనంగా పొందుపరిచారని ఇంత విజయవంతం అయినందుకు తానేంతో సంతోషిస్తున్నానని ఆయన తెలిపారు. రాబోయే నాలుగేళ్లు కూడా మిషన్ కాకతీయ జరుగుతుందని చెప్పారు.
 తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

పారిశ్రామిక రంగంలో సింగిల్ విండో విధానాన్ని రూపొందించంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరో అత్యంత సాహసోపేత నిర్ణయమని అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని పశ్చిమ బెంగాల్ హైకర్టు ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీఎస్ ఐపాస్‌లో పరిశ్రమలకు అనుమతులను రెండు వారాలకే ఇస్తున్నామని, ఇప్పటి వరకు 36 పరిశ్రమలకు అనుమతులిచ్చామని తెలిపారు.

 తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

టీఎస్ ఐపాస్‌లో పరిశ్రమల కోసం ఇప్పటి వరకు లక్షా 50వేల ఎకరాలను కేటాయించామని అన్నారు. ఇలా పరిశ్రమలను స్ధాపనకు కేటాయంచడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ల పనులు ప్రారంభించామని, త్వరలోనే ఈ పనులు పూర్తవుతాయని వెల్లడించారు.

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మరో పథకం వాటర్ గ్రిడ్ అని అన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ పథకం ప్రారంభించడానికి ముందే హడ్కో నుంచి అవార్డు లభించిందని అన్నారు.

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నది నుంచి 1200 టీఎంసీలు, కృష్ణా నుంచి 310 టీఎంసీలు రావాల్సి ఉన్నా గత ప్రభుత్వ పాలకుల వల్లే అది కాగితాలకే పరిమితమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు అధునాతన సౌకర్యాలతో పోలీసు కమాడెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, మహిళల కోసం ప్రత్యేకించి షీటీమ్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. నగరంలో పేకాట, జూదంను సంపూర్తిగా నిర్మూలించడంలో పోలీసులు విజయం సాధించారని అన్నారు.
తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఇది మంచి శుభపరిణామనని పేర్కొన్నారు. గతంలో గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడగా ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గోదావరి మహా పుష్కరాలను ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగక్కుండా విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు.
 తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

తెలంగాణ వస్తే చీకటే అన్నారు, ఏమైంది: జెండా ఆవిష్కరణలో కేసీఆర్

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రతిపక్ష నేత జానా రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

English summary
Telangana CM KCR Flag Hoisting at Golconda Fort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X