మేమున్నాం: జైట్లీకి పాలకూర వడ్డించిన కేసీఆర్: ఆ అకౌంట్ల సీజ్‌పై ఆరా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకారం ఎప్పుడూ ఉంటుందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి జైట్లీకి ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు.

తన ఆహ్వానం మేరకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన జైట్లీని సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి చేపడుతున్న అంశాలపై అడిగారు.

కేసీఆర్... జైట్లీకి స్వయంగా భోజనం వడ్డించారు. మధ్యాహ్న భోజనంలోకి జైట్లీ పుల్కాలు తీసుకున్నారు. జైట్లీ శాకాహారి. దీంతో ఆయనకు శాకాహార భోజనం ఏర్పాటు చేశారు. భోజనంలోకి పాలకూర, పెసరపప్పు, బెండకాయ కూర, పప్పుచారు. చుక్క కూర, సాంబారు, పెరుగు వడ్డించారు. భోజనం అనంతరం పాలకూర, పెసరపప్పు బాగున్నాయని చెప్పారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

తెలంగాణ పథకాలు బాగున్నాయని, దీర్ఘకాలిక ఫలితాలకు అవి దోహదం చేస్తున్నాయని అరుణ్ జైట్లీ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు వీటిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. విభజన చట్టంలోని హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. దేశంలోనే వినూత్న రీతిలో చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. కేసీఆర్‌కు జైట్లీ భరోసా ఇచ్చారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

ఇంటింటికీ నీరందించేందుకు మిషన్‌ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి పథకాలు భారీ వ్యయంతో కూడుకున్నవని, రాష్ట్రానికి తద్వారా దేశానికి శాశ్వతంగా మేలు కలిగించే సంకల్పంతో వీటిని ఎంతో ధైర్యంతో చేపట్టామన్నారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

నీతి ఆయోగ్‌ తమ కార్యక్రమాలను ప్రశంసించిందని, కేంద్రం సాయం చేయాలని సూచించిందని కేసీఆర్ తెలిపారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి ద్వారా వామపక్ష తీవ్రవాద సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులు, రోడ్ల విస్తరణ, విద్యా సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులను కేంద్రం ఇవ్వాలని కోరారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన వర్శిటీ ఏర్పాటు, పారిశ్రామిక రాయితీలుతదితర హామీలను నెరవేర్చాలని కేసీఆర్‌ కోరారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

దేశాభివృద్ధిలో కేంద్ర నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అదనంగా సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని జైట్లీ హామీ ఇచ్చారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన అంశాలను మరోసారి ప్రస్తావించారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

ముఖ్యంగా ఐటీ చెల్లించలేదని హౌసింగ్ బోర్డు అకౌంట్లు సీజ్ చేసిన విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. గతంలో హౌసింగ్ బోర్డుకు ఏవిధంగా అన్యాయం జరిగిందని, ఈ ఐటీ వెనుక ఉన్న సమస్య ఏమిటీ తదితర విషయాలను చర్చించారని సమాచారం. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చారు.

కేసీఆర్ ఇంటికి జైట్లీ

కేసీఆర్ ఇంటికి జైట్లీ

ఈ లంచ్‌లో మంత్రి కేటీఆర్‌, తెరాస ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, భాజపా శాసనసభపక్ష నేత లక్ష్మణ్, శాసనసభ్యులు రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌, ఎమ్మెల్సీ రామచంద్ర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM KCR hosts lunch for Union Minister Jaitley.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి