ఆ జిల్లా అధికారులు అంత యాక్టివ్ కాదు: కెసిఆర్ ఆసక్తికరం

మెదక్: ఎర్రవెల్లి తరహాలోనే కరీంనగర్‌లోను డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం త్వరగా చేసి గృహ ప్రవేశాలు నిర్వహించాలని భావించామని, అయితే ఆ జిల్లా అధికారులు యాక్టివ్‌గా లేరని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అన్నారు.

మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో మే 30వ తేదీలోపు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం గృహ ప్రవేశాలు జరుగుతాయన్నారు. ఎర్రవెల్లికి గోదావరి జలాలు తెప్పిస్తామన్నారు. ఈ నెల 7వ తేదీన గోదావరి జలాల పైన మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు.

ఎర్రవల్లి గ్రామానికి చెందిన వారు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. కెసిఆర్ మెదక్‌ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోదామన్నారు.

Telangana CM KCR tours in Erravalli village

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి మహిళల సహకారంతో కలసికట్టుగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దామని, ఎర్రవల్లిలో వ్యవసాయ పనులను సామూహికంగా నిర్వహించాలని, పంటకు కావాల్సిన మందులను రైతులు సామూహికంగానే చల్లాలన్నారు.

గ్రామాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌ పనులను రైతులు పరిశీలించాలని, పొత్తులో వ్యవసాయం చేస్తూ ముందుకు పోవాలన్నారు. ప్రస్తుతం భూగర్భ జల వనరులను వీలైనంతగా వినియోగించుకుందామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన కెసిఆర్.. ఇళ్లన్నీ హైదరాబాద్‌ గ్రేటర్‌ విల్లాలను మరిపిస్తున్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+