సీఎం కేసీఆర్ చేతికి ఆకుపచ్చ రంగు ఉంగరం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతికి కొత్తగా మరో ఉంగరం చేరింది. ఇప్పటివరకు ఆయన కుడిచేయి ఉంగరం వేలుకు ఎరుపురంగు రాయి ఉన్న ఉంగరాన్ని ధరించేవారు. కానీ తాజాగా ఆకుపచ్చ రంగు ఉన్న ఉంగరం దర్శనమిచ్చింది. దీనిపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేతికి కొత్తగా ఉంగరం పెట్టుకున్నారంటూ వార్త చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
అయితే అది ఉంగరం కాదని ఫిట్‌నెస్ ట్రాకర్ అని బాబు తెలిపారు. అందులో చిప్ ఉంటుందని, తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులకు చేరవేస్తుందని వెల్లడించారు. దీంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా కేసీఆర్ పెట్టుకున్న ఉంగరం గురించి చర్చ ప్రారంభమైంది. కేసీఆర్ ఎప్పుడూ తన కుడిచేతి ఉంగరం వేలుకు ఎప్పుడూ ఒక ఉంగరాన్ని ధరించి కనపడుతుంటారు. ఇప్పుడు ఆకుపచ్చ రంగు ఉంగరం ఉండటంతో దానివల్ల ఎటువంటి మేలు జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు.

సాధారణంగా మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎరుపు రంగును ఆరోగ్యం కోసం ధరిస్తారు. ఆకుపచ్చ రంగును పదవుల్లో ఉన్నతి కోసం ధరిస్తారు. తన పదవిలో ఉన్నతస్థానాన్ని కోరుకోవడంవల్లే కేసీఆర్ ఈ ఉంగరం ధరించారంటూ చర్చ ప్రారంభమైంది. అంతేకాకుండా ఆయనకు కూడా వీటిపై నమ్మకాలుండటం, ముహూర్తాలు చూసుకొని కార్యక్రమాల్లో పాల్గొనడంలాంటివి చేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రంపై మంచి నమ్మకం ఉంది. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీతో టీఆర్ఎస్‌కు హోరాహోరీగా యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ముందుగా వచ్చే అవకాశం ఉందని భావిస్తుండటంతో కలిసి రావడానికి ఇది ధరించారంటున్నారు.












Click it and Unblock the Notifications