త్రిష తెలంగాణకు గర్వకారణం
వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇక, ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగిడి త్రిష (Gongidi Trisha)కు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
త్రిష లాంటి క్రీడాకారులు తెలంగాణకు గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్రిష మరింత రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యం ఉన్న యువతీయువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.

కాగా, మలేషియాలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి అండర్ 19 టీమిండియా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. తెలంగాణలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రతిభతో అద్భుత ఆటను ప్రదర్శించారు. దూకుడుగా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారు. ఓ సెంచరీతోపాటు అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా త్రిష నిలిచారు.

వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి @revanth_anumula గారు అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ #GongadiTrisha గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
— Telangana CMO (@TelanganaCMO) February 2, 2025
మలేషియా… pic.twitter.com/1HCC2O6zs5
ఈ నేపథ్యంలో టీమిండియాతోపాటు ప్రత్యేక త్రిషపై క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా త్రిషకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Historic win! 🎉
— KTR (@KTRBRS) February 2, 2025
India’s U-19 Women’s team has made us proud by clinching the ICC U-19 Women’s T20 World Cup 2025!
A dominant all-round performance. Wishing them a bright future ahead! 🇮🇳🏆
Special congratulations to Telangana girl Gongadi Trisha for her stellar contribution!… pic.twitter.com/sQ2KIVkhcH
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా అండర్-19 వుమెన్స్ జట్టుకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయమని కొనియాడారు. భారత్‌కు చెందిన అండర్-19 మహిళల జట్టు.. టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడం మనల్ని గర్వపడేలా చేసిందన్నారు.
టీమిండియా మహిళల జట్టుకు భవిష్యత్‌లో ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా రాణించిందని ప్రశంసించారు. టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన త్రిషకు ప్రత్యేక అభినందనలు చెప్పారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను గెలుచుకున్న త్రిష మ్యాచ్‌ను ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చారని కేటీఆర్ కొనియాడారు.












Click it and Unblock the Notifications