ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ కార్పొరేషన్లకు సూపర్ న్యూస్!

తెలంగాణలోని మూడు ప్రధాన నగరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లలో ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మెగా గ్రోత్ కారిడార్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ఈ రింగ్ రోడ్లు నిర్మించాలని మున్సిపల్ శాఖ అధికారులకు సూచించారు.

గ్రోత్ కారిడార్ ల అభివృద్ధికి సీఎం రేవంత్ సూచనలు

మున్సిపల్ వ్యవహారాలు మరియు పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏకరూప అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు.మహబూబ్‌నగర్-భూత్‌పూర్-జడ్చర్ల మధ్య గ్రోత్ కారిడార్ ఏర్పాటు, కొత్తగూడెం-పాల్వంచ-సుజాతనగర్‌లను కలిపి గ్రోత్ కారిడార్ అభివృద్ధి చెయ్యాలని సూచించారు.

Telangana CM Revanth Reddy has issued directives to construct Outer Ring Roads for Khammam Warangal and Karimnagar

టెంపుల్ కారిడార్, టూరిజం కారిడార్ లపై రేవంత్ సూచన

నల్గొండ-యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్,ఆదిలాబాద్-నాగోబా-బాసర-కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్,సింగరేణి ప్రాంతంలోని అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన చేశారు. ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకొని రహదారి అభివృద్ధి చేపట్టాలని సీఎం సూచించారు.

విమానాశ్రయాల ప్రాంతాలలో గ్రోత్ కారిడార్ లు

వరంగల్ విమానాశ్రయం నిర్మాణంతో ఆ ప్రాంతం పూర్తిగా మారిపోతుందని, అవసరమైన నీటి సౌకర్యాలను కూడా ఆలోచించాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ రక్షణ శాఖ ఆధ్వర్యంలో వస్తోంది.అలాగే, వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రోత్ కారిడార్లను డిజైన్ చేయాలి. నగరాల్లో ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. లీజు వాహనాలు కూడా ఎలక్ట్రిక్‌గా ఉండాలన్నారు.

రోడ్లపై అక్రమ పార్కింగ్ లకు చెక్ ..తెలంగాణాలో కొత్త పార్కింగ్ పాలసీ!
రోడ్లపై అక్రమ పార్కింగ్ లకు చెక్ ..తెలంగాణాలో కొత్త పార్కింగ్ పాలసీ!

తెలంగాణాలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చర్యలు

సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మల్టీ యుటిలిటీ టవర్లు, ఏఐ ఆధారిత ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. ఈ కొత్త ప్రణాళికలు అమలు చేస్తే తెలంగాణలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన మెగా గ్రోత్ కారిడార్ అభివృద్ధి ప్రణాళికతో ఖమ్మం, కరీమ్నగ, వరంగల్ వాసులలో సంతోషం వ్యక్తం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+