తెలంగాణలో కీలక జాతీయ రహదారులపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలో కీలక జాతీయ రహదారుల ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా కేంద్రమంత్రికి లేఖ రాసిన ఆయన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు ప్రారంభం తర్వాత ఈ లేఖను కేంద్రమంత్రికి అందించారు. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో పలు రహదారి అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయని, వాటికి త్వరితగతిన ఆమోదం తెలిపేలా కేంద్రమంత్రి చొరవ తీసుకోవాలని లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.

161.5 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం పెండింగ్లో ఉందని దీంతో టెండర్ల ప్రక్రియను పలుమార్లు పొడిగించామన్నారు. ఇప్పటికే 99 శాతానికి పైగా భూసేకరణకు అవార్డులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం త్వరగా ఆమోదించాలని ఆయన కోరారు.

 నువ్వేం ముఖ్యమంత్రివి.. నీదేం భాష - రేవంత్ పై కోమటిరెడ్డి సంచలనం..!!
నువ్వేం ముఖ్యమంత్రివి.. నీదేం భాష - రేవంత్ పై కోమటిరెడ్డి సంచలనం..!!
Telangana CM Revanth Reddy Urges Centre to Sanction Funds for Key National Highway Projects

201 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం అలైన్మెంట్ ను హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో చేర్చి కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపించామని ఈ భాగం భూసేకరణ వ్యయంలో 50% వాటాన్ని రాష్ట్రమే భరించేందుకు అంగీకరించిందన్నారు. ఉత్తర భాగానికి సమానంగా దక్షిణభాగం అలైన్మెంట్ కు ఆమోదం తెలిపి ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరారు. ఈ మొత్తం రింగ్ రోడ్డు పూర్తి అయినప్పుడు దాన్ని అసలు ప్రయోజనం నెరవేరుతుందని ఈ రెండింటికి ఆమోదం తెలిపే ప్రాజెక్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణకు ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వానించింది అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నుండి త్వరగా ఆమోదం లభించేలా చూడాలన్నారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ కు త్వరగా తుది ఆమోదం తెలిపే ప్రాజెక్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. nh 765 లో హైదరాబాద్ కల్వకుర్తి మధ్య 56.6 కిలోమీటర్ల సెక్షన్ నాలుగు వరుసల విస్తరణకు మే 16న ఆమోదం లభించిందని త్వరగా అనుమతులను మంజూరు చేయాలని కోరారు.

ఇళ్ల పథకాల లబ్దిదారులకు రేవంత్ గుడ్ న్యూస్-7 లక్షల మంది తనఖా పట్టాలు వెనక్కి..!
ఇళ్ల పథకాల లబ్దిదారులకు రేవంత్ గుడ్ న్యూస్-7 లక్షల మంది తనఖా పట్టాలు వెనక్కి..!

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి వేగవంతమైన రహదారి అనుసంధానం కల్పించాలని, భారత్ ఫ్యూచర్ సిటీ అమరావతి బందర్ పోర్ట్ మధ్య 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర రోడ్డు మౌలిక సదుపాయాల నిధి కింద 1505 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 40 రహదారి పనులకు ప్రతిపాదనలు పంపించామని వీటికి అనుమతులు మంజూరు చేయాలని బ్యాంక్ ఆఫ్ శాంక్షన్ పరిమితిని సడలించాలని కోరారు.

కొత్తగూడెం కొండలలో మూడు ప్రాధాన్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లు సేతు బంధన్ పథకం కింద అనుమతులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని 23 రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని ప్రతిపాదనని సమర్పించామని ప్రాధాన్యత క్రమంలో కొన్నింటినైనా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్రానికి కేంద్రం కూడా తనవంతుగా పూర్తి సహకారం అందించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+