సురేఖ వ్యవహారంలో హైకమాండ్ బిగ్ ట్విస్ట్ - కీలక మలుపు..!!

కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రిగా బర్తరఫ్ తరువాత కొండా సురేఖ మౌనంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కొండా మౌనం వెనుక వ్యూహం పైన చర్చలు సాగుతున్నాయి. పార్టీ నేతలు సురేఖతో దూరంగానే ఉంటున్నారు. సురేఖ గురించి ఎవరూ స్పందించటం లేదు. ఈ సమయంలోనే నేరుగా హైకమాండ్ రంగంలోకి దిగింది. సురేఖ తో మాట్లాడటంతో పాటుగా కీలక సూచనలు చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసు కొంటున్నాయి. సురేఖ కుమార్తె వ్యాఖ్యలతో మొదలైన వివాదం చివరకు మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయటం వరకు వెళ్లింది. ఢిల్లీలో పార్టీ చీఫ్ ఖర్గేను సురేఖ కలిసారు. తన వాదన వినిపించారు. అయితే, వారి మూడ్ స్పష్టం కావటంతో ఢిల్లీ వేదికగానే సురేఖ నేరుగా సీఎం రేవంత్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. తన కంటే ముందు రేవంత్ పైన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేసారు. బీసీ కార్డును తెర మీదకు తెచ్చారు. ఆ సమయంలోనే కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని రేవంత్ పట్టుబట్టటంతో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సురేఖ పైన మంత్రివర్గం నుంచి వేటు వేస్తూనే.. ముగ్గురు మహిళలకు పదవులు కేటాయించారు. కాగా.. సురేఖ ఇక పార్టీ వీడుతారనే ప్రచారమూ సాగింది.

తిరుమల శ్రీవారికి నిత్యం 45 ప్రసాదాల నివేదన : ఏ సమయంలో ఏది, ప్రత్యేకతలు..!!
తిరుమల శ్రీవారికి నిత్యం 45 ప్రసాదాల నివేదన : ఏ సమయంలో ఏది, ప్రత్యేకతలు..!!
telangana-congress-in-charge-meenakshi-natarjan-key-discussions-with-konda-surekha-sparks-new-equati

సురేఖ నిర్ణయం ఏంటి..?

అయితే, సురేఖ తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇతర పార్టీ ల నేతలతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాజీ మంత్రి కొండా సురేఖకు స్వయంగా ఫోన్ చేసినట్ సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో, ఇన్‌ఛార్జ్ నేరుగా ఆమెతో మాట్లాడటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని, చర్చను రేకెత్తిస్తోంది. తాజా పరిణామాలు, పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో తలెత్తిన కొన్ని వ్యక్తిగత అంశాలు మరియు అంతర్గత విభేదాలను పూర్తిగా పక్కనపెట్టి, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో తిరిగి ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ ఆమెకు గట్టిగా సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సురేఖ అందుకు అంగీకారం తెలిపినా... తనకు అన్యాయం జరిగిందని మరో సారి తన వాదన వినిపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో.. ఇప్పుడు సురేఖ పార్టీ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటారా.. తన నిర్ణయం మేరకు వ్యవహరిస్తారా అనేది పార్టీలో ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+