తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ - ఇంఛార్జ్ ల నియామకం..!!
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పీఏసీ సమావేశం తొలిసారిగా జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను నియమించారు. నామినేటెడ్ పదవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ నుంచి సోనియా : తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్‌సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. ప్రధానంగా 5 అంశాల ఎజెండాగా పీఏసీ సమావేశం సాగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్‌లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెపుతూ తీర్మానం చేశారు.

గ్యారెంటీల అమలుపైనా : గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని షబ్బీర్ అలీ గుర్తు చేసారు. సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు. మిగతా గ్యారెంటీల అమలుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. మహిళలకు నెలకు రూ. 2500 భృతిపై ఈ నెల 28న చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు రూ. 4 వేల పెన్షన్ అమలు, విధివిధానాలపై చర్చిస్తున్నామని వెల్లడించారు ఈ నెల 28 నుంచి కొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూసిస్తాం అన్నారు.

లోక్ సభ ఎన్నికల కసరత్తు : కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్‌లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెపుతూ తీర్మానం చేశారు. పార్లమెంట్ నియజక వర్గాల ఇంఛార్జిలను నియమించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ బాధ్యతలు అప్పగించారు. పొంగులేటి-ఖమ్మం , నల్గొండ- ఉత్తమ్, కరీంనగర్-పొన్నం కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఇంచార్జి ..ఏఐసీసీ కార్యదర్శి లకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications