ప్రభుత్వ శాఖల్లో రిటైర్డ్ అధికారుల వివరాలకు డెడ్‌లైన్: ఇక అంతేనా?
పదవీ విరమణ చేసినప్పటికీ వివిధ హోదాల్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న (రిటైర్డ్) అధికారులపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. పదవీ విరమణ పొందిన కొందరు అధికారులను గత ప్రభుత్వం వివిధ స్థాయిల్లో నియమించింది. వివిధ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డుల్లో పనిచేస్తోన్న విశ్రాంత అధికారుల వివరాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి బుధవారం సాయంత్రం 5 గంటలల్లోగా నిర్ణీత నమూనాలో వివరాలు ఇవ్వాలని ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రీ-అపాయింట్ వివరాలను కూడా సమర్పించాలని సూచించారు.

రిటైర్డ్ ఉద్యోగాల వివరాల కోసం ఫార్మాట్ రెడీ:
సదరు ఉద్యోగి రిటైరైంది ఎప్పుడు? వారి పేరు
రిటైర్ అయ్యే నాటికి వారి హోదా ఏంటి?
ఇప్పుడు ఏ శాఖలో కొనసాగుతున్నారు?
రీ అపాయింట్ అయింది ఎప్పుడు?
వారు ఏ హోదాలో కొనసాగుతున్నారు?
ఇంకా ఎంత కాలం కొనసాగేలా ఉత్తర్వుల్లో మెన్షన్ అయింది?
ఇతర వివరాలేమైనా ఉంటే తెలియజేయవచ్చు.
గత (బీఆర్ఎస్)ప్రభుత్వంలో చాలా శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగులు రీ-అపాయింట్ మెంట్ కొనసాగుతు న్నారని ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ ఆరోపించింది. ఇలాంటి వారందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధుల నుంచి తొలగిస్తామని కూడా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక టిన్నర నెల రోజులు అవుతున్న క్రమంలో ఆ వివరాలు సేకరించడంపై దృష్టి పెట్టింది. త్వరలో వీరి ఏరివేత కోసమే ఈ వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటున్నదనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications